US operation: వెనెజువెలా అధ్యక్షుడిపై దాడికి వినియోగించిన ' రహస్య ఆయుధం' ఏమిటి?
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:54 AM
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక దేశాధ్యక్షుడిని అతని ప్రాంతంలోనే అరెస్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మదురోపై దాడి చేసేందుకు అమెరికా శక్తివంతమైన రహస్య ఆయుధాలను వినియోగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతర్జాతీయం, జనవరి11: ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను(Venezuela President Maduro) అమెరికా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక దేశాధ్యక్షుడిని అతని ప్రాంతంలోనే అరెస్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మదురోపై దాడి చేసేందుకు అమెరికా శక్తివంతమైన రహస్య ఆయుధాలను వినియోగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెనెజువెలాలో అమెరికా ఆపరేషన్ గురించి తాజాగా ఓ ప్రత్యక్ష సాక్షి దిగ్భ్రాంతికరమైన ఆరోపణ చేసింది. అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవడానికి జరిగిన దాడిలో అమెరికన్ దళాలు అధునాతన, శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించాయని ఆరోపించబడింది. ఆ రహస్య ఆయుధం కారణంగా వెనెజువెలా సైనికుల ముక్కులోంచి రక్తం కారిందని, అలానే రక్తపు వాంతులు చేసుకున్నారని ఎక్స్ లో ఓ వ్యక్తి ఆరోపించాడని ఓ మీడియా సంస్థ తెలిపింది.
అలానే ఒక్క సైనికుడిని కూడా కోల్పోకుండా అమెరికన్ దళాలు(US operation Venezuela) వందలాది మంది వెనెజులూ సైన్యాన్ని ఎలా తుడిచిపెట్టాయో ఆదేశానికి చెందిన ఓ గార్డు వివరించాడు. 'మేము అప్రమత్తంగానే ఉన్నాము. కానీ అకస్మాత్తుగా ఎలాంటి కారణం లేకుండా మా రాడార్ వ్యవస్థలన్నీ ఆగిపోయాయి. కాసేపటి తర్వాత స్థావరాల మీదుగా చాలా డ్రోన్లు ఎగురుతున్నాయి. ఎలా స్పందించాలో మాకు తెలియలేదు. కొద్దిసేపటికే కొన్ని హెలికాప్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటి ద్వారా 20 మంది అమెరికా సైనికులు ఆ ప్రాంతంలోకి దిగారు. కానీ ఆ కొద్దిమంది సైనికులు తుపాకుల కంటే చాలా శక్తివంతమైన మరో ఇతర ఆయుధాలతో వచ్చారు. వీరు ఇంతక ముందు మేము పోరాడిన వారెవిరాలాగానూ కనిపించలేదు.
మేము వందల సంఖ్యలో ఉన్నప్పటికీ, మాకు ఏమాత్రం అవకాశం లభించలేదు. వారు అంత కచ్చితత్వంతో, వేగంతో కాల్పులు జరుపుతున్నారు. వారిలోని సైనికుడు నిమిషానికి 300 రౌండ్లు కాల్చినట్లు అనిపించింది' అని అతడు తెలిపాడు. గతంలో అమెరికా సైన్యంలో శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇవి మైక్రోవేవ్‌లు లేదా లేజర్ కిరణాలు(microwave laser weapons) వంటి కేంద్రీకృత శక్తిని ఉపయోగించి లక్ష్యాన్ని పూర్తి చేస్తాయి. అయితే అమెరికా వీటిని ఉపయోగించడం ఇదే మొదటిసారి కావచ్చని అమెరికా మాజీ నిఘా వర్గాలు ఓ మీడియా సంస్థతో తెలిపాయి. ఈ ఆయుధాలు రక్తస్రావం, కదలలేకపోవడం, పనిచేయలేకపోవడం, నొప్పి, కడుపులో మంట వంటి కొన్ని లక్షణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి..
బాబా వంగా చెప్పింది నిజమవుతుందా.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..
రిపబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటి నుంచంటే..