గ్రీన్‌కార్డు ఆశావహులు మరింత కాలం ఆగాల్సిందే.. పెర్మ్ దరఖాస్తులకు ఏడాది నిరీక్షణ..
ABN , Publish Date - Jul 08 , 2026 | 01:22 PM
అమెరికాలో ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
అమెరికాలో ఉద్యోగ ఆధారిత (Employment-Based) గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ విడుదల చేసిన తాజా ప్రాసెసింగ్ అప్‌డేట్ ప్రకారం, పెర్మ్ (Program Electronic Review Management) లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలనలో దాదాపు ఒక సంవత్సరం బ్యాక్‌లాగ్ కొనసాగుతోంది. దీంతో గ్రీన్ కార్డు ప్రక్రియ మొత్తం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది (US Green Card).
పెర్మ్ అనేది ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు పొందే ప్రక్రియలో మొదటి, అత్యంత కీలకమైన దశ. ఒక అమెరికన్ కంపెనీ, విదేశీ వ్యక్తిని శాశ్వత ఉద్యోగిగా నియమించుకోవాలంటే ముందుగా అమెరికాలో ఆ ఉద్యోగానికి తగిన స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేరని నిరూపించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే యజమాని ఉద్యోగి తరఫున పెర్మ్ దరఖాస్తు చేస్తాడు (PERM backlog).
పెర్మ్ దశ పూర్తైన తర్వాతే I-140 ఇమిగ్రెంట్ పిటిషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది. పెర్మ్‌లో జాప్యం ఏర్పడితే మొత్తం గ్రీన్ కార్డ్ ప్రక్రియ కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం అధికారులు 2025 జూన్‌లో లేదా అంతకుముందు దాఖలైన పెర్మ్ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. దీంతో కొత్తగా దరఖాస్తు చేస్తున్నవారికి గ్రీన్ కార్డు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది (PERM processing delay).
ఇక, ఆడిట్‌కు ఎంపికైన కేసుల్లో 2025 డిసెంబర్ వరకు దాఖలైన దరఖాస్తులను మాత్రమే ప్రాసెస్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం కొత్తగా పెర్మ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కనీసం 10-12 నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అమెరికాలో హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న భారతీయులలో చాలా మంది ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు కోసం పెర్మ్ ప్రక్రియను అనుసరిస్తారు (Green Card news 2026).
పెర్మ్ దశలోనే ఏడాది ఆలస్యం అయితే.. గ్రీన్ కార్డు ప్రక్రియ ప్రారంభం ఆలస్యమవుతుంది. I-140 దాఖలు కూడా వెనక్కి వెళ్తుంది. ఉద్యోగ మార్పులు, ప్రమోషన్లు వంటి కెరీర్ నిర్ణయాలపై ప్రభావం పడవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల వీసా ప్రణాళికలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రంలో గాలింపు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..