Share News

ఆ ప్రాంతంలోకి వస్తే నాశనమే.. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్..

ABN , Publish Date - Apr 13 , 2026 | 09:27 PM

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్‌కు మరో కఠిన హెచ్చరిక జారీ చేశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 7:30 గంటల నుంచి హోర్ముజ్ దిగ్బంధనం ప్రారంభమైందని తెలిపారు.

ఆ ప్రాంతంలోకి వస్తే నాశనమే.. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్..
Donald Trump

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్‌కు మరో కఠిన హెచ్చరిక జారీ చేశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 7:30 గంటల నుంచి హోర్ముజ్ దిగ్బంధనం ప్రారంభమైందని తెలిపారు. ఇరాన్ ఓడ రేవుల వైపు వెళ్లే అన్ని నౌకలను అమెరికా సైన్యం అడ్డుకుంటోంది. ఇందుకోసం అమెరికా నౌకాదళం భారీగా దళాలను మోహరించింది (Trump Iran boats eliminated).


ఇరాన్ పోర్ట్‌లకు వెళ్లే, బయటకు వచ్చే అన్ని నౌకలను అడ్డుకుంటామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అలాగే ఇరానేతర పోర్టులకు వెళ్లి, వచ్చే వాటికి అంతగా ఆటంకాలు కలిగించబోమని తెలిపింది. అమెరికా విధించిన దిగ్బంధనం వైపు వచ్చే ఇరాన్ నౌకలను నాశనం చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు చెందిన 158 నౌకలను అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ట్రంప్ తెలిపారు. అవి ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్నాయన్నారు (US Iran blockade warning).


ఇరాన్ వద్ద ఉన్న ఫాస్ట్ అటాక్ షిప్స్‌ను ఇప్పటివరకు అమెరికా లక్ష్యంగా చేసుకోలేదని (Strait of Hormuz tensions), వాటిని పెద్ద ముప్పుగా తాము భావించడం లేదని అన్నారు. ఒకవేళ అవి అమెరికా విధించిన దిగ్బంధనం వైపు వస్తే నాశనం చేస్తామన్నారు. కాగా, తమ ఓడరేవులను దిగ్బంధిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. తాము గల్ఫ్ దేశాల ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్‌ దిగ్బంధనం కొనసాగితే.. ముడి చమురు ధర 150 డాలర్లకు చేరుతుందా..


ఇరాన్ క్షిపణి దాడులు.. దెబ్బతిన్న అమెరికా ఫ్యూయల్ ట్యాంకర్ విమానం.. వీడియో వైరల్..

Updated Date - Apr 13 , 2026 | 09:50 PM