Share News

హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం.. అమెరికాకు నాటో దేశాల షాక్..

ABN , Publish Date - Apr 13 , 2026 | 07:07 PM

అమెరికా-ఇరాన్ యుద్ధం కీలక దశలోకి చేరిన సమయంలో అగ్రరాజ్యానికి నాటో మిత్ర దేశాలు షాక్ ఇచ్చాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన హార్ముజ్ దిగ్బంధనానికి నాటో మిత్రదేశాలు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి.

హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం.. అమెరికాకు నాటో దేశాల షాక్..
NATO rejects Hormuz blockade

అమెరికా-ఇరాన్ యుద్ధం కీలక దశలోకి చేరిన సమయంలో అగ్రరాజ్యానికి నాటో మిత్ర దేశాలు షాక్ ఇచ్చాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన హార్ముజ్ దిగ్బంధనానికి నాటో మిత్రదేశాలు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు ఫలించకపోవడంతో, హోర్ముజ్‌లో రవాణాను పూర్తిగా నిరోధించడానికి అమెరికా సైన్యం ఇతర దేశాలతో కలిసి పనిచేస్తుందని ట్రంప్ అన్నారు (NATO rejects Hormuz blockade).


నాటోలోని కీలకమైన బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు హోర్ముజ్ దిగ్బంధనంలో పాల్గొనబోమని ప్రకటించాయి. తమ ప్రాధాన్యం హోర్ముజ్ తెరిచి ఉండడమేనని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తేల్చి చెప్పారు. ప్రపంచ చమురులో దాదాపు 20% హోర్ముజ్ మార్గం ద్వారా సరఫరా అవుతుంది. ఈ మార్గం పూర్తిగా మూసివేస్తే ఇంధన సంక్షోభం మరింత పెరుగుతుంది. అందుకే యూరప్ దేశాలు దిగ్బంధనం కంటే స్వేచ్ఛా రవాణాకే ప్రాధాన్యం ఇస్తున్నాయి (Trump Iran blockade news).


ఇరాన్ పోర్టులకు వెళ్లే నౌకలను అడ్డుకోవాలని, ఆ దేశ ఆయిల్ ఎగుమతులను పూర్తిగా నిలిపివేయాలనేది ట్రంప్ ప్లాన్ (US allies response Iran war). ఈ దిగ్బంధనం యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే నాటో దేశాలు ఈ ప్రణాళికకు దూరంగా ఉన్నాయి. నాటో దేశాలు మద్దతు ఇవ్వకపోవడంతో అమెరికా ఒంటరిగానే ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ నిర్ణయం అమెరికా- ఇతర నాటో దేశాల మధ్య విభేదాలను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్‌ దిగ్బంధనం కొనసాగితే.. ముడి చమురు ధర 150 డాలర్లకు చేరుతుందా..


ఇరాన్ క్షిపణి దాడులు.. దెబ్బతిన్న అమెరికా ఫ్యూయల్ ట్యాంకర్ విమానం.. వీడియో వైరల్..

Updated Date - Apr 13 , 2026 | 07:17 PM