హోర్ముజ్ దిగ్బంధనం కొనసాగితే.. ముడి చమురు ధర 150 డాలర్లకు చేరుతుందా..
ABN , Publish Date - Apr 13 , 2026 | 03:25 PM
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ సముద్ర మార్గాన్ని బ్లాక్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది.
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ సముద్ర మార్గాన్ని బ్లాక్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 100 డాలర్ల దిగువకు వచ్చేసింది (Crude oil price 150 dollars).
డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్టు హోర్ముజ్‌ను పూర్తిగా దిగ్బంధిస్తే క్రూడాయిల్ బ్యారెల్ ధర 150 డాలర్లకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇరాన్‌కు టోల్ ఫీజ్ చెల్లించే ఏ నౌకనూ హోర్ముజ్‌లో ప్రయాణించనివ్వొద్దని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్టు ట్రంప్ ఇప్పటికే తెలిపారు. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏ సైనిక నౌక అయినా హోర్ముజ్‌లోకి ప్రవేశిస్తే దాడి చేస్తామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది (Hormuz blockade oil impact).
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ప్రస్తుతం 8 శాతం పెరిగి 103 డాలర్లకు చేరుకుంది (Global oil supply crisis). ఒకవేళ ట్రంప్ హెచ్చరికలు కార్యరూపం దాల్చితే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 150 డాలర్లకు చేరువ అవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ హెచ్చరిస్తున్నట్టు ఏ నౌకనూ హోర్ముజ్‌లోకి అనుమతించకపోతే రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల సరఫరా ప్రమాదంలో పడుతుంది. దీంతో చమురు ధరలు తారస్థాయికి చేరుకుంటాయి.
ఈ వార్తలూ చదవండి:
దాడుల్లో దెబ్బతిన్న గాంధీ హాస్పిటల్.. వీడియో షేర్ చేసిన ఇరాన్ ఎంబసీ
చర్చల్లో ప్రతిష్టంభన.. ట్రంప్ తదుపరి వ్యూహం ఇదేనా?