Share News

ఇరాన్ క్షిపణి దాడులు.. దెబ్బతిన్న అమెరికా ఫ్యూయల్ ట్యాంకర్ విమానం.. వీడియో వైరల్..

ABN , Publish Date - Apr 13 , 2026 | 02:45 PM

ఎంతో శక్తివంతమైన, అధునాతనమైన అమెరికా యుద్ధ విమానాలకు పశ్చిమాసియాలో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎంతో గొప్పవి అని అమెరికా చెప్పుకుంటున్న యుద్ధ విమానాలు కూడా కూలిపోయాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికా వైమానికి దళానికి భారీ నష్టం సంభవించింది.

ఇరాన్ క్షిపణి దాడులు.. దెబ్బతిన్న అమెరికా ఫ్యూయల్ ట్యాంకర్ విమానం.. వీడియో వైరల్..
KC-135R damaged Iran strike

ఎంతో శక్తిమంతమైన, అధునాతనమైన అమెరికా యుద్ధ విమానాలకు పశ్చిమాసియాలో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికా ఎంతో గొప్పగా చెప్పుకునే వైమానిక దళానికి ఇరాన్ యుద్ధంలో భారీ నష్టం సంభవించింది. పలు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. వాటిల్లో కేసీ-135ఆర్ ట్యాంకర్ విమానం కూడా ఒకటి (KC-135R damaged Iran strike).


తాజాగా ఓ కేసీ-135ఆర్ ట్యాంకర్ విమానం యూకేలోని ఆర్‌ఏఎఫ్ మిల్డెన్ హాల్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయింది. ఆ విమానానికి చాలా తూట్లు పడ్డాయి. విమానం పై భాగంలో మరమ్మత్తులు చేసిన గుర్తులు కూడా కనిపించాయి. యూకే ఏవియేషన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కెల్వీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత నెలలో సౌదీ అరేబియాలోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో ఐదు కేసీ-135ఆర్ ట్యాంకర్ విమానాలు దెబ్బతిన్నాయి. తాజాగా యూకేలో ల్యాండ్ అయిన విమానం ఆ అయిదింటిలో ఒకటి అయి ఉండొచ్చని తెలుస్తోంది (US tanker aircraft UK landing).


యుద్ధంలో ధ్వంసమైన విమానాలను వైమానిక స్థావరాలకు తరలించి మరమ్మత్తులు చేసే పనిలో ప్రస్తుతం అమెరికా ఉంది (Battle damaged aircraft video). కాగా, తాజా ఇరాన్ యుద్ధంలో అమెరికాకు చెందిన 39 యుద్ధ విమానాలు ధ్వంసమైనట్టు వార్తలు వచ్చాయి. అలాగే మరో పది విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు సమాచారం. అమెరికా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐదో తరం యుద్ధం విమానం అయిన ఎఫ్-35 స్టెల్త్ కూడా ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్నట్టు సమాచారం.


ఈ వార్తలూ చదవండి:

దాడుల్లో దెబ్బతిన్న గాంధీ హాస్పిటల్.. వీడియో షేర్ చేసిన ఇరాన్ ఎంబసీ

చర్చల్లో ప్రతిష్టంభన.. ట్రంప్ తదుపరి వ్యూహం ఇదేనా?

Updated Date - Apr 13 , 2026 | 03:16 PM