Share News

భద్రత ఉంటే అందరికీ ఉండాలి.. మా జోలికొస్తే.. గల్ఫ్ రేవులపై దాడి చేస్తాం: ఐఆర్‌జీసీ

ABN , Publish Date - Apr 13 , 2026 | 04:59 PM

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరో కీలక మలుపు తిరిగాయి. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ జోలికొస్తే పర్షియన్ గల్ఫ్ రేవులను దిగ్బంధిస్తామని హెచ్చరించింది.

భద్రత ఉంటే అందరికీ ఉండాలి.. మా జోలికొస్తే.. గల్ఫ్ రేవులపై దాడి చేస్తాం: ఐఆర్‌జీసీ
Iran threatens Gulf ports

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరో కీలక మలుపు తిరిగాయి. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ జోలికొస్తే పర్షియన్ గల్ఫ్ రేవులను దిగ్బంధిస్తామని హెచ్చరించింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రవాణాపై ఆంక్షలు విధించడం సముద్రపు దొంగతనంతో సమానమని ఐఆర్‌జీసీ పేర్కొంది. దానికి తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది (Iran threatens Gulf ports).


తమ భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతటా సముద్ర భద్రత ప్రమాదంలో పడుతుందని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. అమెరికా తమ రేవులను దిగ్బంధిస్తే తాము గల్ఫ్ రేవులను టార్గెట్ చేస్తామని హెచ్చరించింది. భద్రత ఉంటే అందరికీ ఉండాలని, లేకపోతే ఎవరికీ ఉండకూడదని స్పష్టం చేసింది. హోర్ముజ్ జలాల్లో భద్రతను తాము పర్యవేక్షిస్తామని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది (US Iran blockade news).


ఇరాన్ ఓడరేవులకు ముప్పు ఏర్పడితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఏ ఓడరేవూ సురక్షితంగా ఉండదని ఐఆర్‌జీసీ వెల్లడించింది (Persian Gulf tensions). కాగా, హోర్ముజ్ జలసంధి గుండా శత్రు దేశాల నౌకలను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇరాన్ నుంచి అనుమతి పొందిన నౌకలను మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. హోర్ముజ్‌పై నియంత్రణ కొనసాగించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్‌ దిగ్బంధనం కొనసాగితే.. ముడి చమురు ధర 150 డాలర్లకు చేరుతుందా..


ఇరాన్ క్షిపణి దాడులు.. దెబ్బతిన్న అమెరికా ఫ్యూయల్ ట్యాంకర్ విమానం.. వీడియో వైరల్..

Updated Date - Apr 13 , 2026 | 04:59 PM