Share News

క్రూడాయిల్ పైకి.. స్టాక్ మార్కెట్లు కిందకి..

ABN , Publish Date - Apr 13 , 2026 | 03:42 PM

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలు కావడంతో ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 103 డాలర్లకు చేరుకుంది. మరోవైపు హోర్ముజ్‌ను దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

క్రూడాయిల్ పైకి.. స్టాక్ మార్కెట్లు కిందకి..
Stock Market

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలు కావడంతో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 103 డాలర్లకు చేరుకుంది. హోర్ముజ్‌ను దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు డీలాపడ్డాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనమైంది. ఇన్ని వ్యతిరేకతల నేపథ్యంలో సోమవారం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నష్టాలతోనే రోజును ముగించాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (76,794)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 1600 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. అయితే ఉదయం భారీ నష్టాలను చవి చూసిన సూచీలు మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 702 పాయింట్ల నష్టంతో 76,847 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 207 పాయింట్ల నష్టంతో 23,842 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎమ్‌సీఎక్స్ ఇండియా, వోల్టాస్, సోలార్ ఇండస్ట్రీస్, అదానీ పవర్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఐచర్ మోటార్స్, చోలా ఇన్వెస్ట్‌మెంట్, మారుతీ సుజుకీ, నిప్పాన్, ఏపీఎల్ ఆపోలో మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 307 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 330 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 93.38గా ఉంది.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్‌ దిగ్బంధనం కొనసాగితే.. ముడి చమురు ధర 150 డాలర్లకు చేరుతుందా..


ఇరాన్ క్షిపణి దాడులు.. దెబ్బతిన్న అమెరికా ఫ్యూయల్ ట్యాంకర్ విమానం.. వీడియో వైరల్..

Updated Date - Apr 13 , 2026 | 03:43 PM