మేం శాంతిని కోరుకుంటున్నాం.. యుద్ధానికీ సిద్ధంగానే ఉన్నాం: ఇరాన్ రాయబారి
ABN , Publish Date - Apr 13 , 2026 | 07:31 PM
ఇస్లామాబాద్‌లో అమెరికాతో జరిగిన శాంతి చర్చలు విఫలమైనప్పటికీ, తమ డిమాండ్లను అంగీకరిస్తే మరోసారి చర్చలకు సిద్ధమేనని భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇస్లామాబాద్‌లో అమెరికాతో జరిగిన శాంతి చర్చలు విఫలమైనప్పటికీ, తమ డిమాండ్లను అంగీకరిస్తే మరోసారి చర్చలకు సిద్ధమేనని భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యాల గురించి అమెరికా ఇప్పుడు ఓ అవగాహనకు వచ్చి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ తన శక్తిని నిరూపించిందని అన్నారు (Iran envoy US knows capabilities).
హోర్ముజ్ జలసంధి ఇరాన్ ప్రాదేశిక జలాల్లోనే ఉందని, దానిని కాపాడుకోవడానికి తమకున్న హక్కులను వినియోగించుకుంటామని ఫతాలీ అన్నారు. ఇరాన్ పూర్తిగా శాంతి చర్చలకు కట్టుబడి ఉందని, అలాగే సైనిక చర్యలకు కూడా సిద్ధంగానే ఉందని పేర్కొన్నారు. టెహ్రాన్ శక్తి ఏమిటో అమెరికాకు తెలుసని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు, జాతీయ ప్రయోజనాల కోసమే ఇస్లామాబాద్‌లో తమ ప్రతినిధి బృందం 21 గంటల పాటు అమెరికా బృందంతో చర్చలు జరిపిందన్నారు (Mohammad Fathali statement).
అణు సమస్యలు, యుద్ధ నష్టపరిహారం, ఆంక్షల ఉపశమనం వంటి మూడు డిమాండ్లను తమ బృందం అమెరికా ముందు ఉంచిందని (US Iran tensions 2026), వాటిని అగ్రరాజ్యం అంగీకరించకపోవడంతో చర్చలు విఫలమయ్యాయని ఫతాలీ తెలిపారు. తమ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల 3375 మంది పౌరులు మరణించారని, భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించిందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ దిగ్బంధనం కొనసాగితే.. ముడి చమురు ధర 150 డాలర్లకు చేరుతుందా..
ఇరాన్ క్షిపణి దాడులు.. దెబ్బతిన్న అమెరికా ఫ్యూయల్ ట్యాంకర్ విమానం.. వీడియో వైరల్..