ఒప్పందం కుదరకపోతే.. హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: ట్రంప్
ABN , Publish Date - Jun 21 , 2026 | 10:56 AM
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఎలాంటి సుంకాలూ వసూలు చేయదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్‌తో చర్చలు విఫలమైతే మాత్రం అమెరికానే టోల్ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఎలాంటి సుంకాలూ వసూలు చేయదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్‌తో చర్చలు విఫలమైతే మాత్రం అమెరికానే టోల్ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. కాల్పుల విరమణ అమల్లో ఉన్న ప్రస్తుత 60 రోజుల కాలంలో హోర్ముజ్ జలసంధిలో ఎలాంటి టోల్ వసూలూ ఉండదని ట్రంప్ తెలిపారు (Strait of Hormuz).
60 రోజుల్లో ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరకపోతే మాత్రం హోర్ముజ్ జలసంధి మార్గంలో టోల్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు (Hormuz Tolls). పశ్చిమాసియా దేశాలకు అమెరికా అందించిన రక్షణ సేవలకుగానూ ఆ డబ్బును తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం హోర్ముజ్‌లో 60 రోజుల పాటు స్వేచ్ఛా నౌకాయానం అమల్లో ఉంటుందని తెలిపారు. కాగా, ఇరాన్‌తో అణు చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం స్విట్జర్లాండ్‌కు పయనమైంది.
కాగా, ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని, రవాణా నిరంతరాయంగా కొనసాగుతోందని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ వెల్లడించారు (Iran US Talks). పరిస్థితి ఇలాగే ఉండేలా అమెరికా దళాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. శనివారం 17 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురుతో 55 వాణిజ్య నౌకలు హోర్ముజ్‌ను దాటాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..