Share News

హోండూరస్‌లో కాల్పులు.. 25 మంది మృతి

ABN , Publish Date - May 22 , 2026 | 10:32 AM

మధ్య అమెరికా దేశమైన హోండూరస్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాలలో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 25 మంది మరణించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

హోండూరస్‌లో కాల్పులు.. 25 మంది మృతి
Honduras Mass Shooting

ఇంటర్నెట్ డెస్క్: మధ్య అమెరికా దేశమైన హోండూరస్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 25 మంది మరణించినట్లు సమాచారం. మృతి చెందిన వారిలో ఆరుగురు పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు స్థానిక వర్గాలు ధృవీకరించాయి. దశాబ్దాల కాలంగా ఇక్కడ భూ వివాదాలు, కొన్ని గ్యాంగ్స్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మొదట ఉత్తర హోండూరస్‌ లోని ట్రుజిల్లో మున్సిపాలిటీ పరిధిలోని ఓ తోటలో పనిచేస్తున్న కార్మికులపై సాయుధులు దారుణంగా కాల్పులు జరపగా 19 మంది చనిపోయారు.


మరోవైపు.. గ్వాటెమాలా దేశ సరిహద్దుల్లో పోలీస్ కాన్వాయ్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు అధికారులు అక్కడిక్కడే మృతి చెందారు. వీరంతా స్థానిక గ్యాంగ్‌లకు వ్యతిరేకంగా చేపట్టిన మిషన్‌లోని పోలీసులని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై అక్కడ ప్రభుత్వం విచారణ చేపట్టింది. అదనపు బలగాలను రంగంలోకి దించి, నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నిలకడగా బంగారం, వెండి ధరలు..

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 22 , 2026 | 05:01 PM