Share News

అమెరికాను ఓడించేందుకు మా నౌకాదళం సిద్ధంగా ఉంది: ఇరాన్ సుప్రీం లీడర్

ABN , Publish Date - Apr 18 , 2026 | 07:47 PM

అమెరికా-ఇరాన్ మధ్య మరో రెండ్రోజుల్లో శాంతి చర్చలు జరగనున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ, పశ్చిమాసియాలో పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇరాన్ నౌకదళంపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతోంది.

అమెరికాను ఓడించేందుకు మా నౌకాదళం సిద్ధంగా ఉంది: ఇరాన్ సుప్రీం లీడర్
Iran navy warning US

అమెరికా-ఇరాన్ మధ్య మరో రెండ్రోజుల్లో శాంతి చర్చలు జరగనున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ, పశ్చిమాసియాలో పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇరాన్ నౌకదళంపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతోంది. దీంతో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేసింది. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు (Iran navy warning US).


ఇరాన్ నౌకాదళం అమెరికా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉందని మొజ్తాబా ఖమేనీ ప్రకటించారు. శత్రువులకు ఘోర పరాజయాన్ని చవి చూపేందుకు సిద్ధమని అన్నారు. తన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో, 'శత్రువులకు మరో ఓటమిని రుచి చూపించడానికి ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉంది' అని పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత మొజ్తాబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. తన సందేశాలను సోషల్ మీడియా ద్వారానే విడుదల చేస్తున్నారు (Mojtaba Khamenei statement).


కాగా, ఇరు పక్షాలు ఉమ్మడి నిర్ణయం తీసుకునే వరకు అమెరికాతో ఎలాంటి చర్చలూ జరగవని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబ్జా పేర్కొన్నారు (Strait of Hormuz crisis). ఎవరి కోసమూ తమ హక్కులను వదులుకోబోమని స్పష్టం చేశారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించే దిగ్బంధనాన్ని ఇరాన్ అంగీకరించబోదని, వాషింగన్ నుంచి వచ్చే ఆదేశాలకు టెహ్రాన్ కట్టుబడి ఉండదని ప్రకటించారు. ఇతర దేశాలు ఎలా ఉండాలో చెప్పే హక్కు అమెరికాకు లేదన్నారు.


ఇవి కూడా చదవండి..

మళ్లీ హోర్ముజ్ దిగ్భంధనం.. ప్రకటించిన ఇరాన్ సైన్యం..


అమెరికా సైనికులకు భోజనం పెడతాం.. ఇరాన్ వ్యంగ్య వ్యాఖ్యలు

Updated Date - Apr 18 , 2026 | 07:54 PM