Share News

మళ్లీ హోర్ముజ్ దిగ్భంధనం.. ప్రకటించిన ఇరాన్ సైన్యం..

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:21 PM

పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. హోర్ముజ్ జలసంధి తెరుచుకుందనే ఆనందం 24 గంటలు కూడా నిలవలేదు. మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది.

మళ్లీ హోర్ముజ్ దిగ్భంధనం.. ప్రకటించిన ఇరాన్ సైన్యం..
Iran shuts Strait of Hormuz

పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. హోర్ముజ్ జలసంధి తెరుచుకుందనే ఆనందం 24 గంటలు కూడా నిలవలేదు. మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అమెరికా తమ నౌకలపై విధించిన సముద్ర నిర్బంధం కొనసాగుతుండడమే ఇందుకు కారణమని టెహ్రాన్ పేర్కొంది. హోర్ముజ్‌పై కట్టుదిట్టమైన నియంత్రణ విధించినట్లు ప్రకటించింది (Iran shuts Strait of Hormuz).


అమెరికా తన నిర్బంధాన్ని ఎత్తివేయకపోతే జలసంధి పూర్తిగా తెరవబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. హోర్ముజ్‌ను తెరిచినప్పటికీ ఇరాన్ నౌకలపై తమ దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించడం ఉద్రిక్తతలను పెంచింది. హోర్ముజ్ జలసంధి గురించి, శాంతి ఒప్పందం గురించి ట్రంప్ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్‌లన్నీ అబద్ధాలేనని, దౌత్య చర్చలపై ముందుకు సాగుతుండగా ఇలాంటి తప్పుడు సమచారాన్ని ఇరాన్ అంగీకరించదని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ పేర్కొన్నారు (US blockade Iran).


కాగా, అమెరికా-ఇరాన్ మధ్య ఏప్రిల్ 20న రెండో దఫా శాంతి చర్చలు జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ( Strait of Hormuz crisis 2026). పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగానే ఇవి జరగబోతున్నట్టు ఇరాన్ మీడియా పేర్కొంటోంది. అయితే ఈ శాంతి చర్చలు వేదిక, తేదీ గురించి అమెరికా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.


ఇవి కూడా చదవండి...

రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్‌ రాజ్‌పై పరువు నష్టం దావా

2029 నుంచే మహిళా రిజర్వేషన్ అమలు కావాలని ఆశిద్దాం: కేంద్ర మంత్రి భూపతిరాజు

Updated Date - Apr 18 , 2026 | 03:21 PM