అమెరికా సైనికులకు భోజనం పెడతాం.. ఇరాన్ వ్యంగ్య వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 18 , 2026 | 02:51 PM
కొన్ని వారాలుగా పశ్చిమాసియాలో ఉంటున్న అమెరికా సైనికులు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నారట. పలచటి రెండు చపాతీలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొద్దిగా మాంసం మాత్రమే ఉన్న అమెరికా సైనికుల భోజనం ప్లేట్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొన్ని వారాలుగా పశ్చిమాసియాలో ఉంటున్న అమెరికా సైనికులు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి. పలచటి రెండు చపాతీలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొద్దిగా మాంసం మాత్రమే ఉన్న అమెరికా సైనికుల భోజనం ప్లేట్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ వ్యంగ్యంగా స్పందించింది. అమెరికా సైనికులకు తాము భోజనం పెడతామని ఇరాన్ వ్యాఖ్యానించింది (Iran US tensions).
గత కొన్ని వారాలుగా పశ్చిమాసియాలో వేలాది మంది అమెరికా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. యూఎస్‌ఎస్ ట్రిపోలి, యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌకలు హోర్ముజ్ దిగ్బంధనంలో పాల్గొంటున్నాయి. అయితే ఇటీవలి కాలంలో సముద్ర మార్గంలో ఆటంకాల నేపథ్యంలో సరఫరా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో అమెరికా సైనికులకు సరిపడా ఆహారం అందడం లేదని సమాచారం. తమకు వడ్డిస్తున్న ఆహారానికి సంబంధించిన ఫొటోలను సైనికులు తమ కుటుంబ సభ్యలకు పంపించారు (Iran mocks US soldiers).
యుద్ధం వల్ల గగనతలం మూసివేతలు, రవాణా సమస్యల కారణంగానే ఈ సమస్య తలెత్తినట్టు సమాచారం (US military food crisis). అయితే ఇది పూర్తి స్థాయి ఆహార సంక్షోభం కాదని, యుద్ధ సమయంలో సాధారణంగా ఎదురయ్యే లాజిస్టిక్స్ సమస్యేనని అమెరికా చెబుతోంది. అమెరికా సైనికులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిపై ఇరాన్ అధికారులు, నాయకులు వ్యంగ్యంగా స్పందించారు.
ఇవి కూడా చదవండి...
రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్‌పై పరువు నష్టం దావా
2029 నుంచే మహిళా రిజర్వేషన్ అమలు కావాలని ఆశిద్దాం: కేంద్ర మంత్రి భూపతిరాజు