Share News

భారత జెండా ఉన్న నౌకలపై దాడి.. హోర్ముజ్‌లో కాల్పులు..

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:24 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేసింది. తాజాగా హోర్ముజ్‌లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

భారత జెండా ఉన్న నౌకలపై దాడి.. హోర్ముజ్‌లో కాల్పులు..
Strait of Hormuz gunfire

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేసింది. తాజాగా హోర్ముజ్‌లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులకు పాల్పడినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అవి రెండూ భారత జెండాలతో ఉన్నట్టు సమాచారం (Strait of Hormuz gunfire).


హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న రెండు భారత వాణిజ్య నౌకలపై ఐఆర్‌జీసీకి చెందిన ఇరాన్ గన్‌బోట్లు కాల్పులు జరిపాయి. అయితే ఈ దాడిలో ట్యాంకర్లు, వాటిల్లోని సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ రెండు నౌకలను దారి మళ్లించినట్టు 'ట్యాంకర్ ట్రాకర్స్' తెలిపింది. ఇరాక్ నుంచి రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్‌కు తీసుకొస్తున్న ఆ రెండు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధి నుంచి వెనక్కి మళ్లినట్టు సమాచారం (Iran US tensions 2026).


కాగా, అమెరికాతో చర్చల సందర్భంగా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్టు శుక్రవారం ఇరాన్ ప్రకటించింది (Iran closes Hormuz strait). అయితే ఇరాన్ ఓడ రేవుల చుట్టు అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇరాన్ తిరిగి హోర్ముజ్ జలసంధిని మూసేసింది. హోర్ముజ్ జలసంధిని మూసేసినట్టు ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ కాల్పులు జరిగాయి.


ఇవి కూడా చదవండి..

మళ్లీ హోర్ముజ్ దిగ్భంధనం.. ప్రకటించిన ఇరాన్ సైన్యం..


అమెరికా సైనికులకు భోజనం పెడతాం.. ఇరాన్ వ్యంగ్య వ్యాఖ్యలు

Updated Date - Apr 18 , 2026 | 08:17 PM