రూ.35 లక్షలు, నగలు.. తుపాకులతో వచ్చి 20 నిమిషాల్లో చోరీ..
ABN , Publish Date - Apr 18 , 2026 | 05:05 PM
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో సంచలనాత్మక బ్యాంక్ దోపిడీ ఘటన జరిగింది. తుపాకీలు పట్టుకున్న ఐదుగురు ఆగంతకులు బ్యాంక్‌లోకి దూసుకెళ్లి సిబ్బంది, కస్టమర్లను బందీలుగా ఉంచి భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు.
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో సంచలనాత్మక బ్యాంక్ దోపిడీ ఘటన జరిగింది. తుపాకీలు పట్టుకున్న ఐదుగురు ఆగంతకులు బ్యాంక్‌లోకి దూసుకెళ్లి సిబ్బంది, కస్టమర్లను బందీలుగా ఉంచి భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు. కేవలం 20 నిమిషాల్లో ఈ భారీ దోపిడీ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలో ఈ ఘటన జరిగింది (Madhya Pradesh bank robbery).
మొదట ఇద్దరు వ్యక్తులు కస్టమర్లలా బ్యాంక్‌లోకి ప్రవేశించారు. తుపాకులు బయటకు తీసి సిబ్బందిని బెదిరించారు. మరికొన్ని క్షణాల్లో మరో ముగ్గురు వచ్చి బ్యాంక్‌పై పూర్తిగా నియంత్రణ సాధించారు. దుండగులు తుపాకీలు చూపించి సిబ్బంది, కస్టమర్లను ఒకచోట కూర్చోబెట్టారు. అందరినీ బెదిరించేందుకు వారు పలు రౌండ్లు కాల్పులు కూడా జరిపారు. బ్యాంక్ మేనేజర్‌పై దాడి చేసి లాకర్ల తాళాలు తీసుకున్నారు (Singrauli bank heist).
సుమారు రూ.35 లక్షల నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు తీసుకుని పరారయ్యారు (Bank hostage incident MP). కొన్ని నివేదికల ప్రకారం చోరీ అయిన మొత్తం విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఘటన సమయంలో బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డు లేకపోవడం గమనార్హం. సెక్యూరిటీ గార్డు లేకపోవడం వల్లే దుండగులు సులభంగా దొంగతనం పూర్తి చేయగలిగారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. నగరంలోని అన్ని మార్గాలను మూసివేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
మళ్లీ హోర్ముజ్ దిగ్భంధనం.. ప్రకటించిన ఇరాన్ సైన్యం..
అమెరికా సైనికులకు భోజనం పెడతాం.. ఇరాన్ వ్యంగ్య వ్యాఖ్యలు