పదే పదే రసగుల్లాలు తింటున్నాడని.. తందూరీ పొయ్యిపై కూర్చోబెట్టాడు..
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:55 PM
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో మాటిమాటికీ రసగుల్లా తింటున్నాడనే కారణంతో 11 ఏళ్ల బాలుడిని వేడి తందూరీ పొయ్యిలోకి నెట్టిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 15వ తేదీన 11 ఏళ్ల అమర్ అనే బాలుడు తన అమ్మమ్మతో కలిసి ఓ పెళ్లికి వెళ్లాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో మాటిమాటికీ రసగుల్లా తింటున్నాడనే కారణంతో 11 ఏళ్ల బాలుడిని వేడి తందూరీ పొయ్యిలోకి నెట్టిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 15వ తేదీన 11 ఏళ్ల అమర్ అనే బాలుడు తన అమ్మమ్మతో కలిసి ఓ పెళ్లికి వెళ్లాడు. ఆ బాలుడు పదే పదే లోనికి వచ్చి రసగుల్లాలు తింటున్నాడని కేటరింగ్ గుత్తేదారు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా ఆ బాలుడి తీరు మారలేదు (Boy thrown into tandoor).
మరోసారి వంట చేసే ప్రదేశంలోకి వెళ్లి రసగుల్లా తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ కేటరర్ తీవ్ర ఆగ్రహానికి గురై ఆ బాలుడిని తందూరీ పొయ్యిపై కూర్చోబెట్టాడు. దీంతో భయపడిన ఆ కుర్రాడు పట్టుజారిపోయి పోయ్యి లోపల పడిపోయాడు. మంటలు అంటుకోవడంతో గట్టిగా కేకలు వేశాడు. ఆ కేకలు విని పెళ్లికి హాజరైన వారందరూ అక్కడకు వెళ్లి ఆ బాలుడిని బయటకు తీశారు. ఆ బాలుడికి మొహం నుంచి నడము భాగం వరకు తీవ్ర గాయాలయ్యాయి (UP tandoor incident).
వెంటనే ఆ బాలుడిని లఖ్‌నవూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు (rasgulla incident UP). ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడని, ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. బాలుడి కుటుంబీకుల ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కేటరర్ కోసం గాలింపు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
మళ్లీ హోర్ముజ్ దిగ్భంధనం.. ప్రకటించిన ఇరాన్ సైన్యం..
అమెరికా సైనికులకు భోజనం పెడతాం.. ఇరాన్ వ్యంగ్య వ్యాఖ్యలు