Share News

వామ్మో.. ఇవెక్కడి ఎండలు.. ఈ వీడియో చూస్తే బెంగళూరులో పరిస్థితి అర్థమవుతోంది..

ABN , Publish Date - Apr 18 , 2026 | 05:46 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా చల్లని వాతావరణానికి పేరుగాంచిన బెంగళూరు కూడా ఎండలతో ఠారెత్తిపోతోంది. ఇటీవల ఒక మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అందరికీ షాకిస్తోంది.

వామ్మో.. ఇవెక్కడి ఎండలు.. ఈ వీడియో చూస్తే బెంగళూరులో పరిస్థితి అర్థమవుతోంది..
rayons melting video Bengaluru

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా చల్లని వాతావరణానికి పేరుగాంచిన బెంగళూరు కూడా ఎండలతో ఠారెత్తిపోతోంది. ఇటీవల ఒక మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అందరికీ షాకిస్తోంది. బెంగళూరు ఎండల దెబ్బకు క్రేయాన్స్ కూడా కరిగిపోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Bengaluru heat wave).


geetha_shree_nagaraaj అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఆమె తన ఆఫీస్‌లోని ఓ టేబుల్‌పై క్రేయాన్స్ ఉన్న ట్రేను ఉంచింది. వాటిపై ఎండ పడుతోంది. ఆ ఎండ వేడికి క్రేయాన్స్ కరిగిపోవడం మొదలైంది. దానిని చూసి ఆమె షాకైంది. 'నా జీవితంలో బెంగళూరులో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. అయ్యో దేవుడా, క్రేయాన్‌లు కరిగిపోతున్నాయి' అని ఆమె పేర్కొంది. ఈ వీడియో చూస్తే బెంగళూరులో ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది (Crayons melting video Bengaluru).


ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Viral heat video India). ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. 'ఈ పరిస్థితిని సరిదిద్దడానికి మనమందరం మన ఇళ్ల ముందు లేదా మన టెర్రస్‌లపై చెట్లు నాటడం ప్రారంభిద్దాం' అని ఒకరు కామెంట్ చేశారు. 'గ్యాస్ సరఫరా తగినంతగా లేనందు వల్ల ఈ ఎండలను ఉపయోగించి చిన్న చిన్న వంటలు చేసుకోవచ్చు' అని మరొకరు సరదాగా కామెంట్ చేశారు. త్వరలోనే నీటి కొరత సమస్య తీవ్రంగా పెరగొచ్చని చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

మళ్లీ హోర్ముజ్ దిగ్భంధనం.. ప్రకటించిన ఇరాన్ సైన్యం..


అమెరికా సైనికులకు భోజనం పెడతాం.. ఇరాన్ వ్యంగ్య వ్యాఖ్యలు

Updated Date - Apr 18 , 2026 | 05:47 PM