Share News

ఉక్రెయిన్‌ విషయంలో పుతిన్ మాకు మిత్రుడు కాదు: అమెరికా

ABN , Publish Date - Nov 23 , 2026 | 09:45 AM

ఉక్రెయిన్‌ విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అమెరికాకు మిత్రుడు కాదని అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ జే క్లేటన్‌ అన్నారు. పుతిన్‌తో స్నేహపూర్వక సంబంధాలు ఆశించలేమని క్లేటర్ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌ విషయంలో పుతిన్ మాకు మిత్రుడు కాదు: అమెరికా

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌ విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అమెరికాకు మిత్రుడు కాదని అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ జే క్లేటన్‌ అన్నారు. పుతిన్‌తో స్నేహపూర్వక సంబంధాలు ఆశించలేమని క్లేటర్ స్పష్టం చేశారు. ఆదివారం ఏబీసీ న్యూస్‌ నిర్వహించిన ‘దిస్‌ వీక్‌’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఉక్రెయిన్‌ విషయంలో పుతిన్‌ అమెరికా మిత్రుడు ఎంతమాత్రం కాదు’ అని తేల్చిచెప్పారు. కాగా.. ఇటీవల పుతిన్‌ను తమ మిత్రుడిగా అభివర్ణించిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను క్లేటన్‌ సమర్థించారు. ప్రపంచంలోని మూడు అగ్ర అణ్వాయుధ శక్తులైన అమెరికా, రష్యా, చైనా దేశాధినేతల మధ్య చర్చలు జరుగుతున్న సందర్భంలో పుతిన్‌ను మిత్రుడిగా పేర్కొనడం సబబేనని అభిప్రాయపడ్డారు. గత వారం చైనాలో జరిగిన ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో ట్రంప్‌ ఆ వ్యాఖ్యలు చేశారని తెలిపారు.


కాగా.. పుతిన్‌ను మిత్రుడిగా ఎందుకు అభివర్ణించారన్న ప్రశ్నకు అంతకుముందు ట్రంప్‌ స్పందిస్తూ.. ‘4,000 అణ్వాయుధాలు కలిగిన వ్యక్తితో శత్రువుగా కాకుండా మిత్రుడిగా ఉండటం మంచిదే’ అని పేర్కొన్నారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించింది. ప్రస్తుతం ఆ దేశ భూభాగంలో దాదాపు ఐదో వంతు రష్యా నియంత్రణలో ఉంది. శాంతి ఒప్పందం కుదరాలంటే తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతాన్ని పూర్తిగా తమకు అప్పగించాలన్న డిమాండ్‌ను పుతిన్‌ ఇప్పటికీ వీడలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ పుతిన్‌ను మిత్రుడిగా పేర్కొనడంపై ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న యూరోపియన్‌ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అలాగే ‘పుతిన్‌ మా మిత్రుడు కాదు. ఎప్పటికీ కాలేడు’ అని పోలండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌ కూడా స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..


రూ.13 లక్షల బ్రెజ్జాకు బదులుగా రూ.9.5 లక్షల కారు ఇచ్చారని.. పెళ్లినే రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్..

Updated Date - Nov 23 , 2026 | 09:47 AM