Share News

ఇరాన్‌కు ట్రంప్ మరో వార్నింగ్! చర్చలు విఫలమైతే..

ABN , Publish Date - Nov 23 , 2026 | 08:27 AM

పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు జరుగుతున్న చర్చలు విఫలమైతే వచ్చే ఏడాది ఇరాన్‌పై దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు.

ఇరాన్‌కు ట్రంప్ మరో వార్నింగ్! చర్చలు విఫలమైతే..
Donald Trump Warning to Iran

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు జరుగుతున్న చర్చలు విఫలమైతే వచ్చే ఏడాది ఇరాన్‌పై దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు అర్థరహితమని అంసతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఇరాన్ చర్చలను సాగదీయడం మొదలు పెట్టిందని మండిపడ్డారు. మిడ్‌టర్మ్ ఎన్నికల తరువాత దూకుడుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ‘మిడ్‌టర్మ్ ఎన్నికల తరువాత వారు మరింత దూకుడుగా మారారు. చర్చలు జరుపుతూనే ఉంటారు. సాగదీస్తూనే ఉంటారు. అంతా చెత్త’ అని మండిపడ్డారు.


హోర్ముజ్‌లో ఉద్రిక్తలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్ పోర్టుల నుంచి రాకపోకలు లేకుండా అమెరికా దిగ్బంధనం కొనసాగిస్తోంది. ఇరు దేశాలు అడపాదడపా పరస్పర దాడులను కొనసాగిస్తున్నాయి. ఇవి భవిష్యత్తులోనే కొనసాగే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. తాము విధించిన దిగ్బంధనాన్ని ఇరాన్ సవాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ‘వాళ్లు మాకు సవాలు విసరాలనే అశిస్తున్నా. అలా చేస్తే వారు జలసమాధి అవుతారు’ అని ట్రంప్ హెచ్చరించారు.

నిరసనలు కొనసాగించాలి..

ఇదిలా ఉంటే, ఇరాన్‌లోని పలు నగరాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల జరుగుతున్నాయి. ఈ నిరసనలను కొనసాగించాలని ట్రంప్ ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల చారిత్రక విజయం.. 258 స్థానాలు కైవసం

ఆలిస్ హువాంగ్, మెగాస్పీడ్‌పై దర్యాప్తు కొనసాగుతోంది: అమెరికా

Updated Date - Nov 23 , 2026 | 08:51 AM