Share News

రూ.13 లక్షల బ్రెజ్జాకు బదులుగా రూ.9.5 లక్షల కారు ఇచ్చారని.. పెళ్లినే రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్..

ABN , Publish Date - Nov 22 , 2026 | 03:07 PM

హర్యానాలోని సోనిపట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికూతురు కుటుంబం వరుడి కోసం సుమారు రూ.9.5 లక్షల విలువైన హ్యుందాయ్ ఆరా కారును కొనుగోలు చేసింది. అయితే తనకు ఆ కారు వద్దని, రూ.13 లక్షల విలువైన మారుతీ బ్రెజ్జా కావాలని వరుడు పట్టుబట్టాడు.

రూ.13 లక్షల బ్రెజ్జాకు బదులుగా రూ.9.5 లక్షల కారు ఇచ్చారని.. పెళ్లినే రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్..
Delhi Cop Cancels Wedding

ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలోని సోనిపట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికూతురు కుటుంబం వరుడి కోసం సుమారు రూ.9.5 లక్షల విలువైన హ్యుందాయ్ ఆరా కారును కొనుగోలు చేసింది. అయితే తనకు ఆ కారు వద్దని, రూ.13 లక్షల విలువైన మారుతీ బ్రెజ్జా కావాలని వరుడు పట్టుబట్టాడు. చివరకు బ్రెజ్జా కొనలేదన్న కారణంతో పెళ్లికి నిరాకరించి, కుటుంబంతో కలిసి వెనుదిరిగాడు (Delhi Police Cop Wedding).


సోనిపట్‌కు చెందిన సుభాష్ కుమార్ తన కుమార్తె హీనా వివాహాన్ని ఢిల్లీ పోలీస్‌ విభాగంలో పనిచేస్తున్న కుల్దీప్‌తో నిశ్చయించారు. ఈ నెల 20న వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి నిశ్చయమైన తర్వాత వరుడి కుటుంబం నుంచి కారు, బంగారు ఆభరణాలకు సంబంధించి డిమాండ్లు వచ్చాడు. దీంతో వరుడి కోరిక మేరకు రూ.9.5 లక్షల విలువైన హ్యుందాయ్ ఆరా కారును బుక్ చేశారు. కానీ పెళ్లికి ఒక్క రోజు ముందు తనకు ఆ కారు నచ్చలేదని, మారుతీ బ్రెజ్జా కావాలని మధ్యవర్తుల ద్వారా వరుడు సమాచారం అందినచాడు. దీంతో అప్పటికే బుక్ చేసిన కారును రద్దు చేసి బ్రెజ్జా కోసం ప్రయత్నించినప్పటికీ, సమయం లేకపోవడంతో ఏర్పాటు చేయలేకపోయారు (Dowry Demand Case).


కారు విషయంలోనే కాకుండా బంగారం గురించి కూడా వరుడు చాలా ఎక్కువగా డిమాండ్ చేశాడు (Delhi Cop Cancels Wedding). వరుడికి రెండు తులాల బంగారు గొలుసు, అతడి తల్లికి నాలుగు తులాల బంగారు చెవి ఆభరణాలు, వెండి పట్టీలు సిద్ధం చేశారు. అయితే వరుడి సోదరుడు, అతడి భార్యకు కూడా ఆభరణాలు కావాలని అడిగారు. పెళ్లి రోజు ఉదయం మండపం దగ్గరకు వచ్చి బ్రెజ్జా కారు లేదని తెలియడంతో వరుడు పెళ్లికి అంగీకరించలేదు. తన కుటుంబంతో కలిసి వెనుదిరిగాడు. పెళ్లి ఏర్పాట్ల కోసం ఇప్పటివరకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సుభాష్ కుమార్ తెలిపారు. వరుడు కుల్దీప్, అతడి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. కాంగ్రెస్‌కు నాలుగు సూటి ప్రశ్నలు..

ఆసక్తికరంగా కొలత్తూరు ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తారా..?

Updated Date - Nov 22 , 2026 | 03:07 PM