ఇరాన్‌తో డీల్ కుదరాల్సిందే.. లేదంటే ముగింపు తప్పదు.. ట్రంప్ వార్నింగ్!
ABN , Publish Date - Jul 07 , 2026 | 07:14 AM
ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన దూకుడు వైఖరిని ప్రదర్శించారు. ఇరాన్‌తో తాము శాంతి ఒప్పందమైనా చేసుకుంటామని, లేదంటే ఆ చాప్టర్‌ను పూర్తిగా ముగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
వాషింగ్టన్, జులై 7: ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన దూకుడు వైఖరిని ప్రదర్శించారు. ఇరాన్‌తో తాము శాంతి ఒప్పందమైనా చేసుకుంటామని, లేదంటే ఆ చాప్టర్‌ను పూర్తిగా ముగిస్తామని టెహ్రాన్‌కు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ అమెరికా అనుకుంటే.. కొన్ని గంటల్లో ఇరాన్ దేశ మౌలిక సదుపాయాలను పూర్తిగా కుప్పకూల్చే సామర్థ్యం తమకు ఉందంటూ ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు వీలుగా 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, గత వారం జరిగిన పరోక్ష అమెరికా-ఇరాన్ చర్చలలో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ట్రంప్ ఈ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, తాము మిలిటరీ చర్య కంటే దౌత్యపరమైన ఒప్పందానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. 'నేను ఒప్పందానికే మొగ్గు చూపుతాను. ఎందుకంటే అక్కడి 9.1 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. కానీ మా శక్తి ఏంటో వారికి తెలుసు. మేము అనుకుంటే కేవలం ఒక గంటలోనే వారి భారీ బ్రిడ్జ్‌లు కూల్చేయగలం. వారు భారీ ఖర్చుతో నిర్మించుకున్న ఆధునిక ఎనర్జీ ప్లాంట్లు, విద్యుత్ కేంద్రాలను ఒక పూట లోపే పూర్తిగా తుడిచిపెట్టేయగలం. ప్రతి ప్లాంట్ మాయమైపోతుంది, ఆ విషయం వారికి కూడా బాగా తెలుసు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో, గతంలో ఇరాన్‌కు భారీగా నిధులు అందేవని, కానీ ఇప్పుడు వారి దగ్గర డబ్బులు లేవని, అమెరికా కూడా వారికి ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News