ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం?
ABN , Publish Date - Oct 26 , 2026 | 08:12 AM
అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలా, సైనిక చర్యను కొనసాగించాలా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.
ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 26: ఇరాన్‌పై తక్షణ సైనిక దాడులు చేసే అవకాశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా తోసిపుచ్చారు. ఇరాన్‌పై ప్రస్తుతానికి ఎలాంటి దాడులు జరపబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యను ఒప్పందం ద్వారా ముగించాలా లేదా ఇరాన్‌పై మిలిటరీ చర్య ద్వారా 'పని పూర్తి చేయాలా' అనేది ఆలోచిస్తున్నానని ఆయన చెప్పారు. ట్రంప్ తాజా ప్రకటనలతో తక్షణ దాడి ముప్పు తప్పినప్పటికీ, భవిష్యత్తులో మిలిటరీ దాడి లేదా రాయబార చర్చలు జరిగే అవకాశాలు రెండూ సజీవంగానే ఉన్నాయి.
ప్రత్యక్ష చర్చలు నిలిచిపోయినప్పటికీ, ఇరు దేశాల మధ్య మధ్యవర్తుల ద్వారా దౌత్య సమాచార మార్పిడి జరుగుతున్నాయని ఇరాన్ తెలిపింది. అదే సమయంలో వాషింగ్టన్ విధించే షరతుల్ని తిరస్కరించింది. మరోవైపు, ఉద్రిక్తతలను తగ్గించడానికి ఖతార్, పాకిస్తాన్ దేశాల ప్రతినిధులు ఇరాన్ పర్యటనతో పాటు మధ్యవర్తిత్వం నడుపుతున్నారు.
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి మూసివేత.. ఇరాన్, అమెరికాల మధ్య ప్రధాన వివాదాస్పద అంశంగా ఉంది. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే, ఈ జలసంధిని తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ రాయబారి తెలిపారు. అయితే ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ అనుబంధ మీడియా సంస్థలు మాత్రం అలాంటి కొత్త ప్రతిపాదన ఏదీ చేయలేదని, ఈ వార్తలను ఖండించాయి. (Trump Iran Attack Statement)
ఈ వార్తలు కూడా చదవండి:
డిండి ప్రాజెక్టును రద్దు చేయాలనడం సరికాదు
జనసేనతో పొత్తు వద్దే వద్దు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News