Share News

ఇరాన్‌ వద్ద ఇంకా 2,500 క్షిపణులు!

ABN , Publish Date - Nov 15 , 2026 | 09:50 PM

ఇరాన్‌ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ.. ఇరాన్ వద్ద ఇంకా భారీ సంఖ్యలో క్షిపణులు ఉన్నట్లు అమెరికా నిఘా విభాగం అంచనా వేసింది. ఇరాన్‌ ఆయుధ సంపదలో ప్రస్తుతం 1,500 నుంచి 2,500 వరకు క్షిపణులు ఉండవచ్చని అమెరికా నిఘా నివేదిక పేర్కొన్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది.

ఇరాన్‌ వద్ద ఇంకా 2,500 క్షిపణులు!

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చెబుతున్నా.. ఇరాన్ వద్ద ఇంకా భారీ సంఖ్యలో క్షిపణులు ఉన్నట్లు అమెరికా నిఘా విభాగం అంచనా వేసింది. ఇరాన్‌ ఆయుధ సంపదలో ప్రస్తుతం 1,500 నుంచి 2,500 వరకు క్షిపణులు ఉండవచ్చని అమెరికా నిఘా నివేదిక పేర్కొన్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. ఒకవేళ రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధం ప్రారంభమైతే.. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, దాని మిత్రదేశాలపై దాడులు చేసేందుకు ఇరాన్ వద్ద తగినన్ని క్షిపణులు అందుబాటులో ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. అయితే ఇరాన్‌ వద్ద ఎన్ని క్షిపణులు నిల్వ ఉన్నాయి? వాటిలో ఎన్ని ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయి? అనే విషయాలను కచ్చితంగా చెప్పలేమని అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ అంచనాను పూర్తిగా విశ్వసనీయమైనదిగా భావించలేమని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇరాన్‌ వద్ద భారీగా క్షిపణి నిల్వలు ఉన్నాయని భావిస్తున్నారు.


క్షిపణి నిల్వలను పునరుద్ధరిస్తున్న ఇరాన్‌

గత యుద్ధ సమయంలో అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు ఇరాన్‌లోని క్షిపణి తయారీ కేంద్రాలు, ఆయుధ నిల్వలపై దాడులు చేశాయి. అయినా కూడా ఇరాన్‌ తన క్షిపణి నిల్వలను తిరిగి పెంచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తోందని అమెరికా అధికారులు వెల్లడించారు. గతంలోనే నిల్వ చేసుకున్న విడిభాగాలను ఉపయోగించి కొత్త క్షిపణులను తయారు చేస్తున్నట్లు అమెరికా నిఘా నివేదిక పేర్కొంది. యుద్ధానికి ముందు ఉన్న స్థాయితో పోలిస్తే క్షిపణుల ఉత్పత్తి మందగించినప్పటికీ.. శత్రువులపై ప్రయోగించేందుకు అవసరమైన డ్రోన్లు, లో రేంజ్ క్షిపణులు ఆ దేశం వద్ద ఉన్నాయని తెలిపింది. ఇరాన్‌ వద్ద 1,500కు పైగా బాలిస్టిక్‌ క్షిపణులు ఉన్నాయని ఇజ్రాయెల్‌ సైనిక అధికారులు సైతం అంచనా వేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు

చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..

Updated Date - Nov 15 , 2026 | 09:51 PM