సుందర్ పిచాయ్‌ను ‘MONSTER’ అని సంబోధించిన ట్రంప్!
ABN , Publish Date - Sep 30 , 2026 | 09:51 PM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బిజినెస్ సామర్థ్యాన్ని అభినందిస్తూ ఆయన్ను సరదాగా 'మాన్స్టర్' అని సంబోధించారు. వైట్ హౌస్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ AI సమావేశం అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బిజినెస్ సామర్థ్యాన్ని అభినందిస్తూ ఆయన్ను సరదాగా 'మాన్స్టర్' అని సంబోధించారు. టెక్ దిగ్గజాలతో వైట్ హౌస్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ AI సమావేశం అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై సుందర్ పిచాయ్ నవ్వుతూ స్పందిస్తూ.. నేనొక మాన్స్టర్ అని అనుకోవడం కంటే, ఇది ఓ మంచి ట్యాగ్‌లైన్ కావచ్చు అంటూ సమయస్ఫూర్తితో చమత్కరించారు.
కాగా, వైట్ హౌస్ నిర్వహించిన ఈ AI లంచ్ ప్రోగ్రామ్‌కు సుందర్ పిచాయ్‌తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ సహా మొత్తం 31 మంది ప్రముఖ టెక్ సీఈఓలు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల అభివృద్ధి, డేటా సెంటర్లు, విద్యుత్ అవసరాలు, ఈ రంగంలో అమెరికా నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.
ఈ వార్తలూ చదవండి
సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్