Share News

ఏఐతో మానవాళికి ముప్పే!

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:15 AM

అధునాతన కృత్రిమ మేధ వ్యవస్థలు మానవాళికి విపత్తుగా, మనుషుల అస్తిత్వానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌ హెచ్చరించింది.

ఏఐతో మానవాళికి ముప్పే!
AI

  • బ్లాక్‌మెయిల్‌ తరహా ప్రవర్తనకు అవకాశం

  • ఐపీవో పత్రాల్లో ఆంథ్రోపిక్‌ హెచ్చరికలు

  • తమ కంపెనీ విలువను రూ.192 లక్షలకృత్రిమ మేధతో మానవాళికి ముప్పే!

  • ఐపీవో పత్రాల్లో ఆంథ్రోపిక్‌ హెచ్చరికలు

లండన్‌/ శాన్‌ఫ్రాన్సిస్కో, సెప్టెంబరు 29: అధునాతన కృత్రిమ మేధ వ్యవస్థలు మానవాళికి విపత్తుగా, మనుషుల అస్తిత్వానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌ హెచ్చరించింది. అధునాతన ఏఐ మోడళ్లు తమను కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలకైనా దిగే అవకాశం ఉందని.. షట్‌డౌన్‌ చేయకుండా ప్రతిఘటించడం, సమాచారం దాచడం, మార్చేసి చూపించడం, బ్లాక్‌మెయిల్‌ తరహా ప్రవర్తనకు దిగడం వంటివి చేయవచ్చని పేర్కొంది. క్లాడ్‌ ఏఐ మోడల్‌, చాట్‌బాట్లతో కృత్రిమ మేధ రంగంలో ముందువరుసలో ఉన్న ఆంథ్రోపిక్‌ సంస్థ భారీగా పెట్టుబడుల సమీకరణ, స్టాక్‌మార్కెట్‌లో లిస్టింగ్‌కు ఉద్దేశించిన ‘ఐపీవో’ పత్రాల్లో ఈ అంశాలను పేర్కొన్నట్టు అంతర్జాతీయ పత్రికలు కథనాలు ప్రచురించాయి. అధునాతన ఏఐ మోడళ్లు, అప్లికేషన్ల అభివృద్ధి, వినియోగం విస్తృతం అవుతుండటంతో.. హానికలిగించే ప్రమాదం మరింత పెరగవచ్చని ఐపీవో పత్రాల్లో పేర్కొన్నట్టు తెలిసింది. మొత్తం 261 పేజీల ఐపీవో ప్రధాన పత్రాల్లో 80 పేజీల మేర ప్రమాదకారకాలను వివరించినట్టు సమాచారం. ఆంథ్రోపిక్‌ సంస్థ తన విలువను ఏకంగా రూ.192 లక్షల కోట్లు (2 ట్రిలియన్‌ డాలర్లు)గా అంచనా వేస్తూ ఐపీవోకు వస్తుండటం గమనార్హం. ఇదిలా ఉండగా, తమ అధునాతన ‘జీపీటీ 6.1 ఆస్ట్రా’ విడుదలను భద్రతా కారణాలతో నిలిపివేస్తున్నట్టు ఓపెన్‌ఏఐ ప్రకటించింది. ఈ మోడల్‌లో తప్పుదారి పట్టించే, మోసపూరిత ప్రవర్తన ఎక్కువగా కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

Updated Date - Sep 30 , 2026 | 04:19 AM