Share News

సీజ్‌ఫైర్‌కు రష్యా, ఉక్రెయిన్ ఓకే: ట్రంప్

ABN , Publish Date - Oct 11 , 2026 | 09:37 PM

కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో తెలిపారు. ఆ ఒప్పందం వెంటనే అమల్లోకి వచ్చిందని చెప్పారు.

సీజ్‌ఫైర్‌కు రష్యా, ఉక్రెయిన్ ఓకే: ట్రంప్


ఇంటర్‌నెట్ డెస్క్: కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో తెలిపారు. ఆ ఒప్పందం వెంటనే అమల్లోకి వచ్చిందని చెప్పారు. ‘‘కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి. ఈ ఒప్పందం వెంటనే అమల్లోకి వచ్చింది. అయితే, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించరాదు. ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం గత కొద్ది నెలలుగా నేను శ్రమిస్తున్నాను ’’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా.. ఆ ఒప్పందం ఎప్పుడు జరిగిందన్న విషయాన్ని ట్రంప్ వెల్లడించలేదు. అలాగే, దానిని ఏవిధంగా అమలు చేస్తారో కూడా ఆయన చెప్పలేదు. రష్యా కూడా ఈ ఒప్పందంపై స్పందించలేదు.


అది నాకు మంచి వార్త: జెలెన్‌స్కీ

కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరిందని డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ స్పందించారు. అది తనకు మంచి వార్త అని ఆయన చెప్పారు. కాగా.. ఆ ప్రకటన చేయడానికి ముందు జెలెన్‌స్కీతో ట్రంప్ మాట్లాడారు. కాల్పుల విరమణకు సంబంధించి ఉక్రెయిన్‌కు రెండు నెలల పాటు గడువు ఇవ్వాల్సిందిగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెప్పాలని ట్రంప్‌ను జెలెన్‌స్కీ కోరారు. ‘‘మాకు 60 రోజులు గడువు ఇవ్వాలని పుతిన్‌కు చెప్పండి. ఆ సమయంలో మేము ఎన్నికలు నిర్వహిస్తాం’’ అని జెలెన్‌స్కీ అన్నారు. కాగా.. 2019 నుంచి ఉక్రెయిన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనందున ఆ దేశానికి కొత్త ప్రెసిడెంట్ అవసరమని ట్రంప్ అంతకుముందు వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్య చేసిన కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందంపైనా ప్రకటన చేశారు.


ఈ వార్తలనూ చవండి:

రియాద్ విమానాశ్రయంపై దాడి.. సౌదీకి సాయం గురించి అమెరికా ఆలోచన..

రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. ఖండించిన భారత్

Updated Date - Oct 11 , 2026 | 09:52 PM