Share News

ఉక్రెయిన్‌ ప్రజలు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే మంచిది.. ట్రంప్ వ్యాఖ్య

ABN , Publish Date - Oct 11 , 2026 | 08:24 AM

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గట్టివార్నింగ్ ఇచ్చారు. రష్యా ఇంధన మౌలిక వసతులపై దాడులను తక్షణం కట్టిపెట్టాలని డిమాండ్ చేశారు.

ఉక్రెయిన్‌ ప్రజలు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే మంచిది.. ట్రంప్ వ్యాఖ్య
Donald Trump Warns Zelenskyy

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఎడం అంతకంతకూ పెరుగుతోంది. రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడులతో అమెరికాలో ఇంధన ధరలు పెరుగుతున్నాయని ట్రంప్ సర్కారు ఆందోళనతో ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గట్టివార్నింగ్ ఇచ్చారు. రష్యా ఇంధన మౌలిక వసతులపై దాడులను తక్షణం కట్టిపెట్టాలని డిమాండ్ చేశారు. రష్యాతో డీల్ కుదుర్చుకోగలిగే నాయకుడిని ఉక్రెయిన్ ప్రజలు ఎన్నుకోవాలని కూడా సూచించారు. రష్యా డీజిల్ ఎగుమతులపై ఆంక్షలను సడలించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రష్యా డీజిల్ ఎగుమతులను సులభతరం చేసేలా ఆంక్షల సడలింపునకు అమెరికా సిద్ధమైంది. ఈ పరిణామాలపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంధన ఎగుమతులతో పెరిగే అదనపు నిధులతో రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తుందని ఉక్రెయిన్ హెచ్చరించింది.


రష్యా ఆయిల్ రిఫైనరీలపై దాడులు ఆపాలన్న ట్రంప్‌ అభ్యర్థనలను జెలెన్‌స్కీ ఇప్పటికే తిరస్కరించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే రష్యాపై ఆంక్షల సడలింపునకు యూఎస్ సిద్ధమైనట్టు తెలిసింది. ఇప్పటికీ ఉక్రెయిన్ పవర్ ప్లాంట్‌లపై రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులతో నిమిత్తం లేకుండా ఉక్రెయిన్ తన దాడులను ఆపాలని యూఎస్ కోరుతుండగా ఉక్రెయిన్ తిరస్కరించినట్టు తెలిసింది.


తమ విద్యుత్ మౌలికవసతులపై రష్యా దాడులు ఆపితేనే తాము ఆయిల్ రిఫైనరీలపై దాడులను కట్టిపెడతామని యూఎస్ ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్‌కు జెలెన్‌స్కీ చెప్పారు. ఆయిల్ రిఫైనరీలపై దాడులతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగి అమెరికా ప్రజలపై కూడా భారం పెరుగుతోందని ట్రంప్ సర్కారు భావిస్తోంది. అయితే, విద్యుత్ వసతులపై దాడులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు ఒకేలా చూడకూడదని ట్రంప్ సర్కారు వాదిస్తోంది. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ దాడులతో రష్యా ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా డీజిల్ ఎగుమతులను రష్యా నిలిపివేసింది. దీంతో, అంతర్జాతీయంగా డీజిల్‌కు కొరత ఏర్పడింది.


ఈ వార్తలనూ చదవండి:

రియాద్‌ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. 12 మంది మృతి, 300 మందికి గాయాలు!

పసిఫిక్ కాదు.. ట్రంప్ సముద్రం.. పేరు మార్చే యోచనలో అమెరికా అధ్యక్షుడు

Updated Date - Oct 11 , 2026 | 09:57 AM