పోలీసుల వాహనాన్ని ఢీకొట్టిన టెస్లా కారు.. ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ కారణంగానే..
ABN , Publish Date - Oct 17 , 2026 | 10:42 AM
అమెరికాలో పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్లో ప్రయాణిస్తున్న ఓ టెస్లా కారు పోలీసుల వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్లో ప్రయాణిస్తున్న ఓ టెస్లా కారు పోలీసుల వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. గత మంగళవారం కాలిఫోర్నియాలో ఈ ప్రమాదం జరిగింది. మూసి ఉన్న హైవేలోకి ఆ టెస్లా కారు దూసుకెళ్లింది. ఆ తరువాత పోలీసుల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన మొత్తం కార్ డ్యాష్బోర్డ్లో రికార్డయింది. ప్రమాదంలో గాయపడిన పోలీసులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
కాగా ప్రమాద సమయంలో తాను కారును సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్లో పెట్టి నిద్రపోయానని టెస్లా డ్రైవర్ తెలిపాడు. అతడికి ఈ ఘటనలో ఎలాంటి గాయాలూ కాలేదు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోబో ట్యాక్సీలపై టెస్లా దృష్టి సారించిన వేళ ఇలాంటి ప్రమాదాలు జరగడంతో భద్రతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే డ్రైవర్లెస్ టెక్నాలజీపై అనుమానాలు పెరుగుతున్నాయి.
ఈ వార్తలూ చదవండి
టెస్లా ఎగిరే కారు శాంపిల్ మాత్రమే.. ఎలాన్ మస్క్ ఏం ప్లాన్ చేశారంటే..?
టెస్లా రోడ్స్టర్ కారు గాల్లో ఎగరడం వెనుక అసలు రహస్యం ఏంటి?