పుతిన్ ఓ తెలివైన దుర్మార్గుడు.. నిజజీవిత విలన్: కెనడా మాజీ ప్రధాని
ABN , Publish Date - Nov 01 , 2026 | 09:51 PM
పుతిన్ మహా మోసకారి.. దుర్మార్గుడు.. నిజజీవిత బాండ్ విలన్ అంటూ రష్యా అధ్యక్షుడిని కెనడా మాజీ ప్రధాన మంత్రి స్టీఫెన్ హార్పర్ అభివర్ణించారు. అలాగే పుతిన్ భయంకరమైన, ఆసక్తికరమైన, తెలివైన వ్యక్తి కూడా అని హార్పర్ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పుతిన్ మహా మోసకారి.. దుర్మార్గుడు.. నిజజీవిత బాండ్ విలన్ అంటూ రష్యా అధ్యక్షుడిని కెనడా మాజీ ప్రధాన మంత్రి స్టీఫెన్ హార్పర్ అభివర్ణించారు. అలాగే పుతిన్ భయంకరమైన, ఆసక్తికరమైన, తెలివైన వ్యక్తి కూడా అని హార్పర్ పేర్కొన్నారు. కెనడా పత్రికకు రాసిన ఓ వ్యాసంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ‘కష్టపడేతత్వంతో పాటు బోలెడు తెలివితేటలున్న వ్యక్తి పుతిన్. అయినప్పటికీ ఆయన మహా మోసకారి, నిజమైన దుర్మార్గుడు కూడా’ అని హార్పర్ రాసుకొచ్చారు.
‘రష్యా అధ్యక్షుడికి అసాధారణ క్రమశిక్షణ ఉంది. ఆయనకు ఇతరుల బలహీనతలను తన బలంగా మార్చుకునే నైపుణ్యమూ ఉంది. పుతిన్ ఎప్పుడూ తప్పులు చేయరు. ఆయన ఏ అంతర్జాతీయ సమావేశానికి వెళ్లినా తనకు ఏం కావాలో కచ్చితంగా తెలుసుకుని వెళ్తారు’ అంటూ పుతిన్ వ్యక్తిత్వాన్ని హార్పర్ విశ్లేషించారు. కాగా స్టీఫెన్ హార్పర్ కెనడా ప్రధానిగా 2006 నుంచి 2015 వరకు పనిచేశారు. ఆ సమయంలో ఆయనకు, పుతిన్‌కు మధ్య విభేదాలుండేవి. 2014లో జరిగిన జీ20 సదస్సులో వీరిద్దరూ నేరుగా కలుసుకున్నారు.
ఈ వార్తలూ చదవండి
ఇరాన్‌పై మరో యుద్ధానికి సిద్ధం.. ట్రంప్, నెతన్యాహు మధ్య కీలక చర్చలు!
యూకే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించిన ఇరాన్