Share News

రాప్తాడు పాఠశాల విద్యార్థినిపై దాడి కేసు.. నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు..

ABN , Publish Date - Nov 01 , 2026 | 08:56 PM

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బాలికపై దాడి అనంతరం తప్పించుకుని తిరుగుతున్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతడిపై కాల్పులు జరిపినట్లు సమాచారం.

రాప్తాడు పాఠశాల విద్యార్థినిపై దాడి కేసు.. నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు..

అనంతపురం జిల్లా: రాప్తాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై చెట్లు నరికే రంపం యంత్రంతో హేమంత్ దాడి చేశాడు. బాలిక తీవ్రంగా గాయపడటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


అయితే, ఆత్మకూరు అడవుల్లో నిందితుడు ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి అతను తారసపడగా.. తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో యువకుడికి గాయాలైనట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.


కాగా, నిందితుడి దాడిలో గాయపడిన బాలికను బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి నారా లోకేశ్ నేడు ఆస్పత్రికి వద్దకు చేరుకుని బాలిక, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు, విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి లోకేశ్ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

పులివెందుల ఎన్నికల్లో జగన్ ఓటు వేయకపోవడంపై మంత్రి అచ్చెన్న తీవ్ర విమర్శలు

ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.. 20 జిల్లాల్లో 41 ఘటనలు: డీజీపీ

Updated Date - Nov 01 , 2026 | 09:52 PM