Share News

భర్త ద్వారా జెన్సెన్‌కు ఆలిస్ పరిచయం!.. వాల్ స్ట్రీట్ కథనం వెల్లడి

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:11 PM

ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్‌ను ఆలిస్ హువాంగ్‌కు ఆమె భర్త కాంగ్ వెయ్ పరిచయం చేశారని ద వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈ మేరకు ఆ పత్రిక ఒక కథనం వెలువరించింది.

భర్త ద్వారా జెన్సెన్‌కు ఆలిస్ పరిచయం!.. వాల్ స్ట్రీట్ కథనం వెల్లడి

ఇంటర్నెట్ డెస్క్: ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్‌ను ఆలిస్ హువాంగ్‌కు ఆమె భర్త కాంగ్ వెయ్ పరిచయం చేశారని ద వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈ మేరకు ఆ పత్రిక ఒక కథనం వెలువరించింది. ఆలిస్‌ను జెన్సెన్‌కు కెంగ్ ఎప్పుడు, ఏ సందర్భంలో పరిచయం చేశారో కచ్చితంగా తెలియకపోయినా 2010లో ఆ ముగ్గురు భేటీ అయి ఉండవచ్చని వాల్ స్ట్రీట్ పేర్కొంది. ఆ సమయంలో ఎన్విడియా పీసీ గేమింగ్ జీపీయూ తయారీదారుగా ఉందని తెలిపింది. అలాగే కెంగ్ వెయ్ ఆ టైంలో ఒక ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్‌గా ఉన్నారని, వీడియో గేమ్ కంపెనీల కోసం ఆయన పనిచేస్తుండగా.. ఆయన భార్య ఆలిస్ హువాంగ్ జర్నలిజం కోర్సు చేస్తున్నారని కథనం వివరించింది.


జెన్సెన్ హువాంగ్‌తో ఆలిస్ సన్నిహిత సంబంధాన్ని కెంగ్ వెయ్ రెండేళ్ల పాటు భరించినట్లు కనిపించారని, అంతేకాకుండా వారి మధ్య సాన్నిహిత్యం గురించి ఆయన బహిరంగంగానూ మాట్లాడారని ఆలిస్, కెంగ్‌కు తెలిసిన వారు చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. తన భార్యను జెన్సెన్ హువాంగ్‌కు పర్సనల్ సెక్రటరీగా ఆయన పరిచయం చేసి ఉండవచ్చని తెలిపింది. కాగా.. చైనా గూఢచారిగా అనుమానిస్తున్న ఆలిస్‌తో జెన్సెన్ సంబంధాలు పెట్టుకోవడంతో ప్రస్తుతం ఆయన పదవికి ప్రమాదం వచ్చినట్లయింది.


కెంగ్, ఆలిస్ గురించి మరికొంత..

కెంగ్ వెయ్ గతంలో చైనాలో స్టార్ ఫండ్ మేనేజర్‌గా పనిచేశారు. అంతకుముందు 2010లో షాంఘయ్ హెక్సీ అనే పేరుతో తన సొంత కంపెనీ స్థాపించారు. అలాగే ఆలిస్ హువాంగ్ 2000లో హాంగ్ కాంగ్ బాప్టిస్ట్ యూనివర్సిటీ నుంచి మీడియా మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తర్వాత చైనాలో టెలివిజన్ ప్రజెంటర్‌గా పనిచేశారు. తర్వాత ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, కంప్యూటర్ చిప్స్ రంగంలో పనిచేశారు. అనంతరం ఇద్దరూ చైనా, సింగపూర్, తైవాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో వివిధ వ్యాపార సంస్థలు స్థాపించారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్


ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 12 , 2026 | 05:36 PM