Share News

ఉద్యోగులతో యథావిధిగా ఎన్విడియా సీఈఓ మీటింగ్స్

ABN , Publish Date - Nov 11 , 2026 | 10:01 PM

తన వివాహేతర సంబంధం గురించి ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ నేరుగా ఉద్యోగులతో మాట్లాడినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఉద్యోగులతో యథావిధిగా ఎన్విడియా సీఈఓ మీటింగ్స్
Nvidia CEO Jensen Huang

ఇంటర్నెట్ డెస్క్: తన వివాహేతర సంబంధం గురించి ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ నేరుగా ఉద్యోగులతో మాట్లాడినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. సోమవారం ఎన్విడియా సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో ఈ విషయాలను ఆయన వెల్లడించారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఉద్యోగుల ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. ఆ తరువాత యథాప్రకారం, ఆ రోజు కార్యకలాపాలపై సమీక్ష కొనసాగించారు. మంగళవారం కూడా ఆయన ఆఫీసుకు వచ్చి యథావిధిగా సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వచ్చే వారం కంపెనీ త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు జరిగాయి. అయితే, ఈ కథనాలపై ఎన్విడియా ఇంకా స్పందించాల్సి ఉంది.


ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఆదివారం తన ఎఫైర్ గురించి ఉద్యోగులకు ఈమెయిల్‌లో తెలియజేశారు. తన క్షమాపణలతో గతం మారదంటూ విచారం వ్యక్తం చేశారు. కాలమే తన కుటుంబం కోలుకునేలా చేస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి రాబట్టుకుంటానని ప్రయత్నిస్తానని అన్నారు. ఎఫైర్ విషయం వెలుగులోకి వచ్చాక సంస్థలో విషాదకర వాతావరణం నెలకొందని కొందరు ఉద్యోగులు చెప్పినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సుదీర్ఘకాలంగా హువాంగ్‌తో కలిసి పనిచేస్తూ ఆయనను ఓ మార్గదర్శిగా భావించిన ఉద్యోగులు షాక్ తిన్నట్టు తెలిసింది. ఈ వ్యహారంపై ఎన్విడియా విచారణకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రముఖ న్యాయవాద సంస్థను రంగంలోకి దిపింది.


ఈ వార్తలనూ చదవండి:

యుద్ధఖైదీల అప్పగింతకు రష్యా, ఉక్రెయిన్ అంగీకారం

శ్రీలంక గైడ్‌ను సముద్రంలోకి తోసిన ఇజ్రాయెల్ పర్యాటకుడు

Updated Date - Nov 11 , 2026 | 10:01 PM