Share News

అంతులేని ‘గల్లంతు’!

ABN , Publish Date - Aug 31 , 2026 | 05:44 AM

నేపాల్‌ను కుదిపేసిన భీకర వరదల విషాదం అంతకంతకూ విస్తరిస్తోంది. గల్లంతైన వారి సంఖ్య అంతులేని జాబితాలా పెరిగిపోతోంది. వరద ముంచెత్తి ఐదు రోజులైనా...

అంతులేని ‘గల్లంతు’!

  • నేపాల్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ఆచూకీ లేని వారి సంఖ్య

  • తొలుత 1,500గా అంచనా.. ఇప్పుడు 2,500కుపైనే..

  • 781కి చేరిన మృతుల సంఖ్య.. గుర్తుపట్టలేని స్థితిలో దేహాలు

  • టిబెట్‌ ప్రాంతంలో 49 మంది భారతీయుల గల్లంతు

  • 1643 మంది విద్యార్థులను కాపాడిన హెడ్‌మాస్టర్‌

  • నేపాల్‌ వరదల సమయంలో రాజేంద్ర దవాదీ సమయస్ఫూర్తి

ఖాఠ్మాండూ/న్యూఢిల్లీ, ఆగస్టు 30: నేపాల్‌ను కుదిపేసిన భీకర వరదల విషాదం అంతకంతకూ విస్తరిస్తోంది. గల్లంతైన వారి సంఖ్య అంతులేని జాబితాలా పెరిగిపోతోంది. వరద ముంచెత్తి ఐదు రోజులైనా వేలాది మంది ఆచూకీ లభించడం లేదు. వరద వచ్చిన తర్వాతి రోజున 1,500 మంది వరకు గల్లంతై ఉంటారని అంచనా వేయగా.. ఆదివారం నాటికి ఆ సంఖ్య 2,500 దాటిపోయింది. తమ వారి ఆచూకీ లభించడం లేదంటూ ఇంకా అభ్యర్థనలు అందుతూనే ఉన్నాయని నేపాల్‌ అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రానికల్లా 781 మృతదేహాలను వెలికితీశామని వెల్లడించారు. నది పొడవునా ఎనిమిది జిల్లాల్లో మృతదేహాలు బయటపడుతున్నాయని.. అయితే అవన్నీ కుళ్లిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నాయని పేర్కొన్నారు. ఇక ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 9,435 మందిని రక్షించామని తెలిపారు. ఇక మూడు జిల్లాల్లోని పలు పాఠశాలలకు చెందిన 238 మంది విద్యార్థులు, 18 మంది టీచర్లు వరదల్లో గల్లంతయ్యారని నేపాల్‌ విద్యాశాఖ ఆదివారం వెల్లడించింది. అకస్మాత్తు వరదల్లో నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుల్లోని గ్యిరోంగ్‌ పోర్టు వద్ద 558 మంది వరకు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే అందులో ఏయే దేశాలవారు ఎంత మంది ఉన్నారనే వివరాలను చైనా ఆదివారం వెల్లడించింది. మొత్తంగా 261 మంది విదేశీయుల ఆచూకీ లభించడం లేదని తెలిపింది. అందులో భారతీయులు 49 మంది ఉన్నారు. భోటేకోషి నదీ వ్యవస్థ మొదలయ్యే ప్రాంతంలో మంచుకొండలు విరిగిపడి ఏర్పడిన సరస్సులో భారీ స్థాయిలో నీళ్లు చేరుతున్నాయని.. అది ఎప్పుడైనా బద్దలై మరో భారీ వరద రావొచ్చని చైనా అధికారులు ఆదివారం మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. దానికితోడు భోటేకోషి, త్రిశూలి, నారాయణి నదుల పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

విద్యుత్‌ కేంద్రాల సొరంగాల్లో 537 మంది

వరదలతో 354 మెగావాట్ల సామర్థ్యమున్న ఎనిమిది జలవిద్యుత్‌ కేంద్రాలు, నిర్మాణంలో ఉన్న మరో ఐదు విద్యుత్‌ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని నేపాల్‌ అధికారులు వెల్లడించారు. విద్యుత్‌ కేంద్రాల సొరంగాల్లో విధుల్లో ఉన్న 898 మంది ఆచూకీ లేకుండా పోయారని.. అందులో 361 మందిని రక్షించగా, మిగతా 537 మంది జాడ తెలియడం లేదని వెల్లడించారు. సొరంగాల ప్రారంభ మార్గాల్లో భారీగా బురద చేరడం, కొన్ని చోట్ల మూసుకుపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోందని తెలిపారు. ముఖ్యంగా అప్పర్‌ త్రిశూలి విద్యుత్‌ కేంద్రం వద్ద సొరంగంలో 300కిపైగా చిక్కుకున్నారని.. వారిని కాపాడేందుకు భారత్‌కు చెందిన 11 మంది టన్నెల్‌ రెస్క్యూ బృందంతో కలిసి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.


బిక్కుబిక్కుమంటున్న నిరాశ్రయులు

అకస్మాత్తు వరదల్లో ఇళ్లు సహా సర్వం కోల్పోయిన వేలాది మంది సహాయక శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కట్టుబట్టలతో మిగిలామని, ఇప్పుడెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో నీటి సరఫరా వ్యవస్థలు, పైపులైన్లు ధ్వంసం కావడంతో.. సహాయక శిబిరాల్లో మంచినీటికి ఇబ్బంది ఎదురవుతోంది. ఇక వరదల్లో త్రిశూలి, భోటేకోషి, నారాయణి నదులపై 19 వంతెనలు, పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. దానితో ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసరాల రవాణా సమస్యగా మారింది.

ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని

తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 05:44 AM