Share News

Kim Jong Un: మళ్లీ బయట ప్రపంచంలోకి కిమ్ కుమార్తె

ABN , Publish Date - Jan 02 , 2026 | 02:42 PM

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆయన కుమార్తె కిమ్‌ జు యే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. రెండేళ్ల క్రితం బహిరంగంగా కనిపించిన ఆమె తాజాగా మళ్లీ కనిపించారు. తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల సమాధులు ఉండే ప్రదేశం ‘కుమ్‌సుసన్‌’ స్మారకాన్ని ఆమె సందర్శించింది. గత మూడేళ్ల నుంచి తండ్రి కిమ్‌జోంగ్‌ ఉన్‌తో పాటు కిమ్‌ జు యే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

   Kim Jong Un: మళ్లీ బయట ప్రపంచంలోకి కిమ్ కుమార్తె
Kim Jong Un

ఇంటర్నెట్ డెస్క్, జనవరి 2: ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్ (Kim Jong Un) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన వింత చర్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు చాలా అరుదుగా బయటకు వస్తుంటాయి. కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆయన కుమార్తె కిమ్‌ జు యే (Kim Ju Ae) ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. రెండేళ్ల క్రితం బహిరంగంగా కనిపించిన ఆమె తాజాగా మళ్లీ కనిపించారు. తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల సమాధులు ఉండే ప్రదేశం ‘కుమ్‌సుసన్‌’ స్మారకాన్ని ఆమె సందర్శించింది. గత మూడేళ్ల నుంచి తండ్రి కిమ్‌జోంగ్‌ ఉన్‌తో పాటు కిమ్‌ జు యే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. కిమ్‌ తన కుమార్తెను అధికారిక పర్యటనలకు తీసుకువెళ్తుండడంతో.. భవిష్యత్తులో అధికారిక పగ్గాలు ఆమెకే అందించనున్నట్లు పరోక్షంగా సంకేతాలను పంపుతున్నారని దక్షిణ కొరియా నిఘా వర్గాలు భావిస్తున్నాయి.


నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ మాజీ నాయకులకు కిమ్ జోంగ్(Kim Jong Un) నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కిమ్‌తో పాటు అయన సతీమణి రి సోల్ జు, కుమార్తె కిమ్‌ జు యే, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. గతేడాది కిమ్‌ చైనాకు అధికారిక పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా ఆయన వెంట కిమ్‌ జు యే ఉంది. తొలిసారి 2022లో కిమ్ తన కుమార్తె కిమ్‌-జు-యే (Kim Ju Ae)ను ప్రపంచానికి పరిచయం చేశారు. 2023లో మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్యాంగ్యాంగ్‌లో రెండోసారి కనిపించింది.


ఇక ఆ తర్వాత నుంచి పలు అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరవుతోంది. ఇవన్నీ ఆమెకు అధికర పగ్గాలు అప్పగించేందుకే చేస్తున్న చర్యలనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. కాగా దక్షిణకొరియా నిఘా వర్గాల ప్రకారం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. కిమ్‌ కూడా వంశపారంపర్యంగానే అధికార పగ్గాలు చేపట్టారు. తండ్రి కిమ్‌ జోంగ్‌-2 2011లో మరణించారు. ఆయన తదనంతరం ఉత్తర కొరియా అధ్యక్షుడిగా కిమ్ జోంగ్ ఉన్ నియమితులయ్యారు.



ఇవీ చదవండి:

బలహీనంగా ఉన్నా.. అన్నాడీఎంకేనే మా ప్రత్యర్ధి

గాలి జనార్దన్ రెడ్డితోపాటు పలువురిపై కేసు నమోదు

Updated Date - Jan 02 , 2026 | 02:42 PM