Share News

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 16 , 2026 | 08:13 AM

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజాలో పౌరుల ప్రాణనష్టాన్ని అరికడతానని పదేపదే హామీలిచ్చినా, ఆచరణలో మాత్రం సైనిక దాడులను కొనసాగించి లెక్కలేనంత మంది ప్రాణాలు తీశారని బైడెన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు
Joe Biden

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజాలో పౌరుల ప్రాణనష్టాన్ని అరికడతానని పదేపదే హామీలిచ్చినా, ఆచరణలో మాత్రం సైనిక దాడులను కొనసాగించి లెక్కలేనంత మంది ప్రాణాలు తీశారని బైడెన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన ఆత్మకథ పుస్తకం 'ప్రామిస్ మీ, అమెరికా' (Promise Me, America) లో ఈ విషయాలను వెల్లడించారు. అలానే ఇజ్రాయెల్ అధినేతతో తనకున్న విభేదాలను, అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలలోని లోపాలను ఈ పుస్తకం ద్వారా నిర్మొహమాటంగా వెల్లడించారు. ఈ నెల 17న విడుదల కానున్న ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్య విషయాలను ప్రముఖ యూఎస్ మీడియా నెట్‌వర్క్‌లు వెల్లడించడంతో ఇవి అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన ఉగ్రదాడి తర్వాత ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక ప్రతిచర్యలపై బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా తన మద్దతును కోల్పోతోందని, పౌరుల మరణాల సంఖ్యలు పెరగడం ప్రమాదమని నేతన్యాహుతో అనేకసార్లు మాట్లాడినట్లు బైడెన్ గుర్తుచేసుకున్నారు. తాను చెప్పిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని సానుకూలంగా స్పందించే వారని, అయితే, నేతన్యాహు మాటలు తప్ప చేతల్లో ఎలాంటి మార్పు చూపలేదని బైడెన్ విమర్శించారు. 'తాము ఏనాడు నెరవేర్చలేని, లేక నెరవేర్చే ఉద్దేశం లేని హామీలు ఇవ్వడంలో 'బిబి' (నేతన్యాహు)కి ఎలాంటి సంకోచం లేదు' అని తన ఆత్మకథ పుస్తకంలో బైడెన్ పేర్కొన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం దేశ దీర్ఘకాలిక భవిష్యత్తును విస్మరించడం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆయన తెలిపారు.


హమాస్ దాడి జరిగిన రోజే తాను నేతన్యాహుకు ఫోన్ చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్న తన వైఖరిని తెలియజేసినట్లు బైడెన్ గుర్తుచేసుకున్నారు. అయితే ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కును తాము సమర్థించినప్పటికీ, పౌరుల రక్షణ కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తొలిరోజు నుంచే ఒత్తిడి తెచ్చినట్లు బైడెన్ తెలిపారు. ఇద్దరి మధ్య ప్రత్యక్ష సంభాషణలు ఉన్నప్పటికీ సరైన నమ్మకం మాత్రం కుదరలేదని ఆయన తెలిపారు. నేతన్యాహు తన స్వార్థం కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలను వంచించడానికి కూడా వెనుకాడరని బైడెన్ ఈ పుస్తకం ద్వారా స్పష్టం చేశారు.


ఈ వార్తలూ చదవండి

ఎన్విడియా పగ్గాలు మళ్లీ హువాంగ్ చేతికేనా?.. రంగంలోకి టెక్ దిగ్గజాలు..!

విడాకుల తరువాత జీవితంలోకి కొత్త నేస్తం.. వరాహంతో స్నేహబంధం!

యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 181 సీట్లు అడుగుతోంది: అఖిలేశ్ యాదవ్

Updated Date - Nov 16 , 2026 | 08:13 AM