రోగనిరోధక శక్తిని దెబ్బతీసే 4 అలవాట్లు ఇవే.. వీటికి దూరంగా ఉండాల్సిందే!
ABN , Publish Date - Nov 16 , 2026 | 07:05 AM
శరీరాన్ని అంటువ్యాధులు, రోగాల నుంచి కాపాడటానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం. బ్యాక్టీరియా, వైరస్, ఇతర హానికర వ్యాధికారకాలతో రోగనిరోధక శక్తి పోరాడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: శరీరాన్ని అంటువ్యాధులు, రోగాల నుంచి కాపాడటానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం. బ్యాక్టీరియా, వైరస్, ఇతర హానికర వ్యాధికారకాలతో రోగనిరోధక శక్తి పోరాడుతుంది. వాటి నుంచి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఈ వ్యవస్థ బలహీనపడినప్పుడు శరీరానికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముంది. వైద్య నివేదికల ప్రకారం రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు వైరస్‌ల బారినపడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కొన్ని అలవాట్ల వల్ల ఈ వ్యవస్థకు హాని జరుగుతోందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటంటే..
నిద్రలేమితో ముప్పు..
రాత్రి సమయాల్లో తగినంత నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. 2019లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం, రోగనిరోధక కణాల సాధారణ పనితీరుకు ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర చాలా అవసరం. నిద్రలేమి వల్ల కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. శరీరంలో నిద్రలో ఉన్నప్పుడు సైటోకిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఈ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
జంక్ ఫుడ్ వద్దే వద్దు..
ప్రాసెస్ చేసిన ఆహారం, జంక్ ఫుడ్స్, చక్కెర అధికంగా ఉండే పదార్థాలకు స్వస్తి చెప్పడం మంచిది. ఇలాంటి ఆహారాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవచ్చు. శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అవసరం. అవి లేని ఆహారం ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందుకే పండ్లు, కూరగాయలు లాంటి పోషకాలున్న ఆహారాన్ని తినాలి.
రోజంతా కూర్చోవడమూ హానికరమే
రోజంతా కూర్చోవడం కూడా హానికరమే. అసలు వ్యాయామం చేయకపోయినా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం క్రమం తప్పని శారీరక శ్రమ రోగనిరోధక కణాలను చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే నడవడం, యోగా చేయడం లాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వండి.
మద్యపానం.. ధూమపానం
అధికంగా మద్యం సేవించడం రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మద్యపానం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి శరీరానికి లోపిస్తుంది. అదేవిధంగా సిగరెట్లు, పొగాకు వినియోగం కూడా ఈ వ్యవస్థను బలహీన పరుస్తుంది. వీటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించడం శ్రేయస్కరం.
ఇవీ చదవండి
చలికాలంలో రోగనిరోధక శక్తి పెంచేందుకు బెస్ట్ ఫుడ్ ఇదే..
హెచ్ విటమిన్ చేసే మాయ ఏమిటి?