Share News

యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 181 సీట్లు అడుగుతోంది: అఖిలేశ్ యాదవ్

ABN , Publish Date - Nov 15 , 2026 | 10:10 AM

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నాయి. అయితే విపక్ష కూటమిలో సీట్ల పంపకాల వ్యవహారం వివాదాస్పదంగా మారే అవకాశం కనబడుతోంది.

యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 181 సీట్లు అడుగుతోంది: అఖిలేశ్ యాదవ్
Akhilesh Yadav

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నాయి. అయితే విపక్ష కూటమిలో సీట్ల పంపకాల వ్యవహారం వివాదాస్పదంగా మారే అవకాశం కనబడుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నీకల్లో కాంగ్రెస్ ఏకంగా 181 అసెంబ్లీ స్థానాలను కోరుతున్నట్లు ఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. మొత్తం 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో దాదాపు సగం సీట్లు కాంగ్రెస్ అడుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు (Akhilesh Yadav Comments).


కాంగ్రెస్ అన్ని సీట్లు అడుగుతున్నప్పటికీ అఖిలేశ్ మాత్రం సానుకూల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో తమ సంబంధాలు బాగున్నాయని, బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమి కలిసే పోరాడుతుందని అఖిలేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని స్థానాలు కోరుతోందని అఖిలేశ్‌ను ప్రశ్నించగా.. ఆయన 181 సీట్లు అడుగుతోందని జవాబిచ్చారు. అఖిలేశ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా స్పందించింది. నవంబర్ 17న సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకాలపై చర్చలు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది (Congress 181 Seats).


ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ బలమైన శక్తిగా ఉండేది (Seat Sharing Talks). కానీ క్రమంగా ఆ పార్టీ ప్రభావం తగ్గుతూ వచ్చింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలను గెలుచుకుంది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడంతో పరిస్థితి కొంత మారింది. ఎస్పీ 37 స్థానాలు, కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఫలితాలతో రాష్ట్రంలో తమ బలం పెరిగిందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని ప్రయత్నిస్తోంది.


ఇవి కూడా చదవండి..

కాల్పుల భయం.. పాకిస్థాన్‌లోని రహస్య స్థావరాలకు హఫీజ్ సయీద్, మసూద్ అజర్‌..


ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 15 , 2026 | 10:10 AM