Share News

మూడోసారి వివాహేతర సంబంధాల వివాదంలో ఎన్విడియా మాజీ సీఈఓ

ABN , Publish Date - Nov 13 , 2026 | 11:39 AM

వివాహేతర సంబంధాలతో చిక్కుల్లో పడిన ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించి ఇంకో సంచలన విషయం బయటకొచ్చింది. ఆయనకు ఆ సంస్థలోని మరో ఉద్యోగినితో సంబంధాలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మూడోసారి వివాహేతర సంబంధాల వివాదంలో ఎన్విడియా మాజీ సీఈఓ

ఇంటర్నెట్ డెస్క్: వివాహేతర సంబంధాలతో చిక్కుల్లో పడిన ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించి ఇంకో సంచలన విషయం బయటకొచ్చింది. ఆయనకు ఆ సంస్థలోని మరో ఉద్యోగినితో సంబంధాలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైనా గూఢచారిణిగా అనుమానాలున్న ఆలిస్ అనే మహిళతోనూ, ఎన్విడియా హెల్త్‌కేర్‌ విభాగం ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్న కింబర్లీ పావెల్‌తోనూ జెన్సన్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఇప్పటికే ఆరోపణలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా తరువాత మరో ఆరోపణ తెరపైకి వచ్చింది. ఎన్విడియా మాజీ సీఈఓకు మరో ఉద్యోగినితో కూడా వివాహేతర సంబంధముందని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. అయితే ఆ ఉద్యోగిని పేరు బయటకు రాలేదు.


కాగా వరుస వివాదాల్లో చిక్కుకున్న జెన్సన్ హువాంగ్‌ నిన్న (గురువారం) తన పదివికి రాజీనామా చేశారు. వివాహేతర సంబంధాల కారణంగా జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలు వ్యక్తమవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జెన్సన్ స్థానంలో తాత్కాలిక సీఈఓగా కొలెటె క్రెస్‌ కొనసాగనున్నారు. మరోవైపు సీఈఓ జెన్సన్ రాజీనామా ప్రకటించగానే ఎన్విడియా షేర్లు భారీగా పతనమయ్యాయి. ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో షేర్ల విలువ 10.3 శాతం మేర పడిపోయింది. దీంతో ఎన్విడియా మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్ల దిగువకు చేరుకుంది.


ఈ వార్తలూ చదవండి

టాయిలెట్ల క్లీనింగ్ నుంచి లక్షల కోట్ల సామ్రాజ్యం వరకు.. జెన్సన్ హువాంగ్ జీవితంలో అనూహ్య మలుపులు!

ఎన్విడియా సీఈవో జెన్సన్‌ రాజీనామా

Updated Date - Nov 13 , 2026 | 11:52 AM