టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి
ABN , Publish Date - Mar 02 , 2026 | 10:30 AM
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ రాజధాని టెహ్రాన్ యుద్ధ జ్వాలలతో అట్టుడుకుతోంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran) యుద్ధ జ్వాలలతో అట్టుడుకుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’(Operation Roaring Lion) లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఉత్తర టెహ్రాన్‌లో ఉన్న గాంధీ హాస్పిటల్(Gandhi Hospital) పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో భవనం చాలా వరకు దెబ్బతింది. బాంబుల తాకిడికి కిటికీలు పగిలిపోయి, వార్డుల నిండా శిథిలాలు పేరుకుపోయాయి. దట్టమైన పొగలు వెలువడటంతో హాస్పిటల్ లో ఉన్న రోగులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఓవైపు బాంబు దాడులు జరుగుతున్నా నర్సులు తమ ప్రాణాలకు తెగించి ఇన్సులేటర్లలో ఉన్న నవజాత శిశువులను, ఐసీయూ(ICU)లోని చిన్నపిల్లలను చేతులతో పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ స్పందించారు. ఆసుపత్రులపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం అన్నారు. ఇలాంటి దాడులను అడ్డుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి
మీ కళ్లకు, మెదడుకు టెస్ట్.. ఈ వృద్ధుడి మొహంలో ఉన్న ముగ్గురు అమ్మాయిలను కనుక్కోండి..
ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా?