ఖమేనీ జీవితాన్ని మార్చేసిన 1981 ఉదంతం.. 45 ఏళ్లుగా కోటు వెనకాల చెయ్యి..
ABN , Publish Date - Mar 02 , 2026 | 07:04 AM
ఖమేనీ మృతి పట్ల ఇరాన్ 40 రోజుల పాటు సంతాపదినాలను, ఏడు రోజుల పాటు పూర్తిస్థాయి సెలవులను ప్రకటించింది. ఇరాన్ ప్రజలు అత్యంత పవిత్రమైనదిగా భావించే ఖోమ్ నగరంలోని జమ్‌కారన్ మసీదుపై ఎర్రజెండా ఎగురవేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన సంగతి తెలిసిందే. శనివారం ఇజ్రాయెల్-అమెరికా దళాలు టెహ్రాన్‌లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ నాయకులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. శనివారం జరిగిన ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కూతురు, అల్లుడు, మనవడు కూడా చనిపోయారు. ఇక, ఖమేనీ మృతి పట్ల ఇరాన్ 40 రోజుల పాటు సంతాపదినాలను, ఏడు రోజుల పాటు పూర్తిస్థాయి సెలవులను ప్రకటించింది. ఇరాన్ ప్రజలు అత్యంత పవిత్రమైనదిగా భావించే ఖోమ్ నగరంలోని జమ్‌కారన్ మసీదుపై ఎర్రజెండా ఎగురవేశారు.
అప్పుడు తప్పించుకున్నారు.. ఇప్పుడు చనిపోయారు..
45 ఏళ్ల క్రితం ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై బాంబ్ దాడి జరిగింది. ఖమేనీ సుప్రీం లీడర్ అవ్వడానికి 8 సంవత్సరాల ముందు ఆయనను చంపడానికి కుట్ర జరిగింది. 1981లో ఖమేనీ ఇరాన్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఇరాన్, ఇరాక్ దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. 1981 జూన్ 27వ తేదీన ఖమేనీ మసీదులో ప్రార్థనలు చేయడానికి వెళ్లారు. ప్రార్థనల అనంతరం తన ఫాలోవర్స్‌తో మాట్లాడారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో ఓ యువకుడు ఖమేనీ దగ్గరకు వచ్చాడు.
ఖమేనీ కూర్చున్న చోటులో ఉన్న డెస్క్‌పై టేప్ రికార్డర్ పెట్టి బటన్ నొక్కాడు. ఓ నిమిషం తర్వాత టేప్ రికార్డర్ విజిల్ వేయటం మొదలెట్టింది. ఆ తర్వాత భారీ శబ్ధం చేస్తూ పేలింది. ఈ పేలుడు కారణంగా ఖమేనీ అత్యంత తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాల నుంచి కోలుకోవడానికి ఆయనకు కొన్ని నెలలు పట్టింది. కుడి చెయ్యి, స్వర పేటిక, ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. కొన్ని గాయాలు పూర్తిగా మానిపోయాయి. చెయ్యి మాత్రం శాశ్వతంగా పారలైజ్ అయిపోయింది. ఇక, అప్పటినుంచి ఆయన తన కుడి చెయ్యిని కోటు వెనకాల దాచుకుంటూ వస్తున్నారు. చనిపోయే ముందు వరకు చెయ్యి కోటు వెనకాలే ఉంది.
ఇవి కూడా చదవండి
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..