ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడిన ఇరాన్.. ఎక్స్ వేదికగా పోస్ట్..
ABN , Publish Date - Apr 24 , 2026 | 01:40 PM
భారత్, చైనాలను నరక కూపాలుగా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది. ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ పోస్టుపై ఆగ్రహించింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్.. మహారాష్ట్ర గొప్ప సాంస్కృతిక, భౌగోళిక వారసత్వాన్ని వివరిస్తూ ఓ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
న్యూఢిల్లీ: భారత్, చైనాలను నరక కూపాలుగా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది. ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ పోస్టుపై ఆగ్రహించింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్.. మహారాష్ట్ర గొప్ప సాంస్కృతిక, భౌగోళిక వారసత్వాన్ని వివరిస్తూ ఓ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఈ సందర్భంగా ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. మహారాష్ట్ర సాంస్కృతిక, భౌగోళిక వైవిధ్యాన్ని చూపిస్తూ 'ఒకసారి భారత్‌కి వచ్చి చూసి మాట్లాడండి' అంటూ వ్యాఖ్యానించింది.
భారత్, చైనా దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నరకాలుగా అభివర్ణించాడు. ఆయా దేశాల నుంచి అమెరికాకు వచ్చేవారిని ‘గ్యాంగ్‌స్టర్స్ విత్ ల్యాప్‌టాప్స్’గా పేర్కొన్నాడు. దీనికి సంబంధించి అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ శావేజ్ పాడ్‌కాస్ట్‌ను డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమంలో రీపోస్టు చేశాడు. 10 నిమిషాల పాటు ఉన్న సదరు వీడియోలో భారత్, చైనాలపై మైఖేల్ శావేజ్ జాత్యహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో వివాదం చెలరేగింది.
మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అతని వ్యాఖ్యలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ట్రంప్ మాటలు అనుచితమైనవిగా, అవగాహనలేనివిగా ఆయన అభివర్ణించారు. ఇవి భారత్- అమెరికా సంబంధాల నిజమైన స్వరూపాన్ని ప్రతిబింబించవని జైస్వాల్ అన్నారు. మరోవైపు చైనా కూడా ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. తాజాగా ఇరాన్ సైతం ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది.
ఈ వార్తలు కూడా చదవండి
పాక్‌లో చర్చలు.. పెద్ద తప్పే చేశాము: ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు
ఇప్పటివరకూ ఒక్కరికే ట్రంప్ గోల్డ్ కార్డు: యూఎస్ మంత్రి