యూఎస్, ఇరాన్ యద్ధానికి ఇంకా పరిష్కారం రాలేదు: అరాఘ్చీ
ABN , Publish Date - Oct 05 , 2026 | 01:36 PM
అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఇంకా పరిష్కారం దొరకలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అన్నారు. న్యాయం, ఇచ్చిపుచ్చుకొనే మార్గాల ద్వారానే రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం టెహ్రాన్‌లో దౌత్యవేత్తలు, విదేశాంగ ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఇంకా పరిష్కారం దొరకలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అన్నారు. న్యాయం, ఇచ్చిపుచ్చుకొనే మార్గాల ద్వారానే రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం టెహ్రాన్‌లో దౌత్యవేత్తలు, విదేశాంగ ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. అదనపు ఆంక్షలు, మిలిటరీ చర్యలతో సమస్యకు పరిష్కారం దొరకదని, పైగా అలా చేస్తే వివాదం మరింత ముదురుతుందన్నారు.
‘‘మా శత్రువులు దాడిచేస్తే, మేము కూడా మరింత భీకరంగా దాడులు చేస్తాం. యుద్ధం, దౌత్యం రెండింట్లోనూ అమెరికా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మాపై ఆంక్షలు వేయడం సరికాదు. అలా చేస్తే అమెరికాకే మరింత నష్టం. ఆంక్షల వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు. పరస్పర గౌరవంతో కూడుకున్న దౌత్య సంప్రదింపులు ఒక్కటే మా ఇద్దరి మధ్య సమస్యకు పరిష్కారం’’ అని అరాఘ్చీ వ్యాఖ్యానించారు.
డిమాండ్లు చేసే కాలం పోయింది
అనవసరంగా టైం వృధా చేసుకోరాదని అమెరికాను అరాఘ్చీ హెచ్చరించారు. డిమాండ్లు చేసే కాలం పోయిందన్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ మాట్లాడుతూ సంప్రదింపులను ఆలస్యం చేయడం, ఏకపక్షంగా డిమాండ్ చేయడం వంటి వాటికి కాలం చెల్లిందన్నారు. హోర్ముజ్ రీఓపెనింగ్ కోసం అమెరికా ముందు తాము ఉంచిన షరతులకు ఆ దేశం ఒప్పుకుంటే, ఏడు రోజుల్లోగా ఆ జలసంధిలో రవాణా సాధ్యమవుతుందని ఐక్యరాజ్య సమితిలో ఇదివరకే ప్రతిపాదించామని ఆయన గుర్తుచేశారు. హోర్ముజ్‌లో శాంతి, సుస్థిరతను తిరిగి తీసుకురావడమే తమ మొదటి ప్రాధాన్యమని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుపాకీ పట్టిన ఇరాన్ మహిళలు.. హైఅలర్ట్
గుర్తు తెలియని వ్యాధితో లాబ్ వర్కర్ మృతి.. రష్యాలో కలకలం
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..