తుపాకీ పట్టిన ఇరాన్ మహిళలు.. హైఅలర్ట్
ABN , Publish Date - Oct 05 , 2026 | 10:14 AM
అమెరికా భూతలదాడులకు దిగవచ్చన్న అంచనాలతో ఇరాన్ మిలిటసీ సామాన్య పౌరులకు ఆయుధ శిక్ష ఇవ్వడం ప్రారంభించింది. మహిళలు కూడా ఈ ట్రెయినింగ్ కేంద్రాల్లో మహిళలు కూడా శిక్షణ తీసుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాతో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ మహిళలు తుపాకీ పట్టారు. ఆదివారం మిలిటరీ అధికారులు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ రకాల ఆయుధాల వినియోగంపై తర్ఫీదు పొందారు. మిడ్‌టర్మ్ ఎన్నికల తరువాత అమెరికా మళ్లీ దాడులు మొదలుపెట్టవచ్చన్న భయాల నడుమ సామాన్య మహిళలు కూడా రంగంలోకి దిగారు.
ఇమామ్ హుస్సేన్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆదివారం మహిళలు పాల్గొన్నారు. రైఫిల్స్, హ్యాండ్‌గన్స్‌ను ఎలా వినియోగించాలో మిలిటరీ అధికారులు మహిళలకు నేర్పించారు. అంతకుముందు రోజు కూడా ఇరాన్ మిలిటరీ అధికారులు సామాన్యులకు ఆయుధాలపై శిక్షణ ఇచ్చేందుకు హఫ్త్ ఈ తీర్ స్క్వేర్‌లో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇరాన్ భూభాగంపై అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం కాలుపెడితే వారిని ఎదుర్కొనేందుకు వీలుగా సామాన్య పౌరులకు అక్కడి మిలిటరీ శిక్షణ ఇస్తోంది.
కుటుంబాలను కాపాడుకునేందుకే తాము శిక్షణ తీసుకుంటున్నామని ఈ ట్రెయినింగ్ క్యాంపుల్లోని కొందరు మహిళలు పేర్కొన్నారు. యుద్ధం కోసం కాదని చెప్పారు. స్వీయరక్షణపై శిక్షణ తీసుకున్నాక తనకు కుటుంబంపై ఉన్న ఆందోళన కొంతమేర తగ్గిందని ఓ మహిళ తెలిపారు.
ఇరాన్‌పై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటానని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ‘ఇరాన్ ఇప్పటికే చాలా వరకూ దెబ్బతిన్నదని. మిగిలిన పనిని ఎలా పూర్తి చేయాలన్నదే ప్రశ్న’ అని ఇటీవల ఓ విలేకరుల సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఇరాన్ మాత్రం ట్రంప్ హెచ్చరికలను లక్ష్యపెట్టలేదు. ‘సైనిక శక్తిని ప్రయోగించేందుకు శత్రువులు నిర్ణయించుకుంటే గతంలో కంటే తీవ్రంగా మా ప్రతిస్పందన ఉంటుంది’ అని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అరాగ్చీ స్పష్టం చేశారు. ఈ సమస్యకు సైన్యాన్ని దింపడం కానీ, కొత్త తరహా ఆంక్షలు విధించడం కానీ పరిష్కారం కాదని స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో వెలుగులోకి మరో షాకింగ్ విషయం..
గుర్తు తెలియని వ్యాధితో లాబ్ వర్కర్ మృతి.. రష్యాలో కలకలం