యూకే బేస్ నుంచి బీ1 బాంబర్లను తరలించిన అమెరికా
ABN , Publish Date - Oct 05 , 2026 | 07:55 AM
యూకేలోని గ్లూసెస్టర్‌షైర్‌లో బ్రిటిష్ మిలిటరీ బేస్ రాఫ్ ఫెయిర్‌ఫోర్డ్‌లో ఉన్న తన బీ1 బాంబర్లను అమెరికా స్వదేశానికి తరలించింది. ఆ బాంబర్లపై ఇరాన్ దాడికి పాల్పడేందుకు కుట్ర జరిపినట్లు అనుమానం రావడంతో అమెరికా వాటిని తన దేశానికి పంపింది.
ఇంటర్‌నెట్ డెస్క్: యూకేలోని గ్లూసెస్టర్‌షైర్‌లో బ్రిటిష్ మిలిటరీ బేస్ రాఫ్ ఫెయిర్‌ఫోర్డ్‌లో ఉన్న తన బీ1 బాంబర్లను అమెరికా స్వదేశానికి తరలించింది. ఆ బాంబర్లపై ఇరాన్ దాడికి పాల్పడేందుకు కుట్ర జరిపినట్లు అనుమానం రావడంతో అమెరికా వాటిని తన దేశానికి పంపింది. యూకేలోని బ్రిటిష్ మిలిటరీలో మోహరించిన తమ బీ1 బాంబర్లన్నింటినీ వెనక్కి తీసుకొచ్చామని అమెరికా ధ్రువీకరించింది. అవన్నీ అమెరికాలోని వాటి హోం స్టేషన్లలో ఉన్నాయని పేర్కొంది. మరోవైపు రాఫ్ ఫెయిర్‌ఫోర్డ్‌ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందన్న అనుమానంపై బ్రిటిష్ కౌంటర్ టెర్రరిజం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. గత నెల 27న రాఫ్ ఫెయిర్‌ఫోర్డ్ వద్ద ఐదుగురు వ్యక్తులు ముఖానికి ముసుగు వేసుకుని 3 భారీ వాహనాల్లో రావడం తాను చూశానని ఓ స్థానిక రైతు ఫిర్యాదు చేశాడు. వారు ఆ స్థావరం చుట్టూ కాసేపు తిరిగారని తెలిపాడు. దీంతో అధికారులు దర్యాప్తు జరిపి వారిని అరెస్టు చేశారు. బ్రిటన్ పేలుడు పదార్థాల చట్టం, ఉగ్రదాడికి కుట్ర ఆరోపణలపై వారిని అరెస్టు చేశారు. ఆ ఐదుగురిని బ్రిటిష్ పౌరులుగా గుర్తించారు. అయితే, వారి వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో బెయిల్‌పై విడుదల చేశారు. అలాగే, దర్యాప్తులో ఈనెల 1న ఆరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అతడిని బ్రటిష్-ఇరాన్ జాతీయుడిగా గుర్తించారు. తర్వాత అతడిని కూడా బెయిల్‌పై విడుదల చేశారు. ఆ వ్యక్తుల వెనుక ఏదైనా దేశం ఉందా అని బ్రిటిష్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇరాన్ హస్తం ఉంది: బ్రిటిష్ ప్రధాని
తమ దేశంలోని రాఫ్ ఫెయిర్‌ఫోర్డ్‌లో అమెరికా మోహరించిన బీ1 బాంబర్లను పేల్చేయడానికి ఇరాన్ కుట్రపన్నిందని బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హమ్ ఆరోపించారు. అమెరికా కూడా ఆయన ఆరోపణలను సమర్థించింది. అయితే, ఆ ఆరోపణలను ఇరాన్ కొట్టివేసింది. బ్రిటన్, అమెరికా చేసిన ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. కాగా.. తమపై దాడికి అమెరికా ఉపయోగిస్తున్న వెస్టర్న్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ అంతకుముందు హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం
ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..