Share News

హమాస్ ఫైనాన్స్ చీఫ్ అంతం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:04 PM

హమాస్ ఆర్థిక విభాగాధిపతి హతమయ్యాడని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో తమ దళాలు జరిపిన దాడిలో మహమ్మద్ అబు అల్వాన్ చనిపోయాడని వెల్లడించింది.

హమాస్ ఫైనాన్స్ చీఫ్ అంతం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన
IDF Eliminates Hamas Finance Chief Muhammad Abu Alwan in Khan Younis

టెల్ అవీవ్, సెప్టెంబర్ 23: గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ సంయుక్తంగా చేపట్టిన వ్యూహాత్మక దాడిలో హమాస్ ఆర్థిక రంగానికి నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ అబు అల్వాన్ హతమయ్యాడని ఇజ్రాయెల్ వెల్లడించింది.


ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కచ్చితమైన సమాచారంతో శత్రు మూలాలను దెబ్బతీసిన సైనిక బలగాలను, భద్రతా సంస్థలను ప్రధాని, రక్షణ మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.


గాజాలో హమాస్ అంతమయ్యే వరకు పోరు ఆగదని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. హమాస్ నాయకులు, వారి ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాలపై దాడులు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. గాజాలో హమాస్ ఉనికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు, అక్టోబర్ 7 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండే వరకు సైనిక చర్యలు ఆపేది లేదని నెతన్యాహు స్పష్టం చేశారు.


సరిహద్దు వివాదం - హమాస్ ఆరోపణలు

డ్రోన్లు, బెలూన్ల బెదిరింపులు: గాజా నుంచి దాడికి వాడుతున్న డ్రోన్లు, గాలిపటాలు, బెలూన్లను వెంటనే నిలిపివేయకపోతే ఆ ప్రాంతాలను ఖాళీ చేయించి తీవ్రస్థాయిలో విరుచుకుపడతామని ఇజ్రాయెల్ ఇటీవల హెచ్చరించింది.


హమాస్ కౌంటర్: ఇజ్రాయెల్ ఆరోపణలపై హమాస్ తీవ్రంగా స్పందించింది. పిల్లలు ఎగరేసే గాలిపటాలను సాకుగా చూపిస్తూ ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేస్తోందని, ఇది 'చిన్నపిల్లలను భయభ్రాంతులకు గురిచేయడమే' అని హమాస్ ప్రతినిధి హజెమ్ ఖాసిమ్ ఆరోపించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిలబెట్టుకోవాలని ఐరాస, ఇతర మధ్యవర్తిత్వ దేశాలను కోరారు.


ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 23 , 2026 | 06:02 PM