Share News

పాక్ అణ్వాయుధ కేంద్రాలు సేఫ్.. ఐఏఈఏ నిపుణుల వెల్లడి

ABN , Publish Date - Oct 15 , 2026 | 03:33 PM

పాకిస్థాన్ అణ్వాయుధ కేంద్రాలు సురక్షితంగా ఉన్నాయని అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ (ఐఏఈఏ) నిపుణులు తెలిపారు. తన అణ్వాయుధాల కేంద్రాలు, మెటీరియల్‌ను కాపాడుకునేందుకు పాక్ అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు బాగున్నాయని ఆ నిపుణులు చెప్పారు.

పాక్ అణ్వాయుధ కేంద్రాలు సేఫ్.. ఐఏఈఏ నిపుణుల వెల్లడి

ఇంటర్‌నెట్ డెస్క్: పాకిస్థాన్ అణ్వాయుధ కేంద్రాలు సురక్షితంగా ఉన్నాయని అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ (ఐఏఈఏ) నిపుణులు తెలిపారు. తన అణ్వాయుధాల కేంద్రాలు, మెటీరియల్‌ను కాపాడుకునేందుకు పాక్ అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు బాగున్నాయని ఆ నిపుణులు చెప్పారు. ఐఏఈఏకు చెందిన ఇంటర్నేషనల్ ఫిజికల్ ప్రొటెక్షన్ అడ్వైజరీ సర్వీస్‌ (ఐపీపీఏఎస్) నిపుణుల బృందం మొదటిసారిగా పాక్ భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ను 12 రోజుల పాటు సమీక్షించింది. న్యూక్లియర్ మెటీరియల్, అణ్వాయుధ కేంద్రాల భద్రత కోసం పాక్ అనుసరిస్తున్న విధానాలను ఐఏఈఏ నిపుణుల బృందం నిశితంగా గమనించింది. ఆ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలను సరిగ్గా అమలు చేస్తున్నట్లు కనుగొన్నామని ఆ బృందం వెల్లడించింది. ఈ మేరకు ఐఏఈఏ ఒక ప్రకటన విడుదల చేసింది. పాక్ అణు భద్రతా పాలనా విధానం మెరుగవుతోందని, తన అణు భద్రతా పాలనా విధానంపై పాక్ ఎప్పటికపుడు సమీక్ష నిర్వహించుకుంటోందని తెలిపింది.


న్యూక్లియర్ భద్రతా నిపుణతను అభివృద్ధి చేసేందుకు పాక్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కృషి చేస్తోందని పేర్కొంది. కాగా.. మొరొకో ఏజెన్సీ ఫర్ న్యూక్లియర్ అండ్ రేడియోలాజికల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మాజీ డైరెక్టర్ జనరల్ ఖమ్మర్ రాబిట్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులు.. పాక్ అణ్వాయుధ కేంద్రాలను సందర్శించారు. వారిలో చైనా, రొమేనియా, రష్యా, స్లొవేకియాకు చెందిన నిపుణులతో పాటు ఐఏఈఏకు చెందిన ఇద్దరు స్టాఫ్ మెంబర్లు ఉన్నారు. అణ్వాయుధ కేంద్రాల పరిశీలన తర్వాత పాక్ అణు భద్రతా పాలనా విధానాంపై ఆ నిపుణులు పలు సిఫారసులు చేశారు. ‘పాకిస్తాన్‌లోని మొదటి ఐపీపీఏఎస్ మిషన్ విజయవంతంగా పూర్తయింది. దేశంలో ఇప్పటికే స్థిరంగా ఉన్న అణు భద్రతా వ్యవస్థకు సంబంధించిన నియంత్రణ, కార్యాచరణ అంశాలను మరింత బలోపేతం చేయడంలో పాక్ నిబద్ధతను ఈ మిషన్ చాటిచెబుతోంది’ అని ఐఏఈఏ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అధిపతి కరీన్ హెర్వియో తెలిపారు.


ఇవి కూడా చదవండి..

చైనా విడిభాగాలతో హూతీల క్షిపణులు.. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాకు ముప్పు తప్పదా..


మరికొంచెం తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 15 , 2026 | 05:13 PM