Share News

పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పి సర్‌ప్రైజ్ చేసిన సైంటిస్ట్ కార్ల్

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:28 PM

సాధారణంగా పొద్దున్నైతే చాలు. పిల్లలను స్కూలుకు పంపడంలో పేరెంట్స్ తీరిక లేకుండా ఉంటారు. పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ సిద్ధం చేస్తూ బిజీగా గడుపుతుంటారు. మెడిసిన్‌లో నోబెల్ బహుమతికి ఎంపికైన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్ల్ డీసెరోథ్ కూడా సోమవారం ఉదయం అలాగే బిజీగా ఉన్నారు. ఉన్నట్టుండి ఓ వార్త ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.

పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పి సర్‌ప్రైజ్ చేసిన సైంటిస్ట్ కార్ల్

ఇంటర్‌నెట్ డెస్క్: సాధారణంగా పొద్దున్నైతే చాలు. పిల్లలను స్కూలుకు పంపడంలో పేరెంట్స్ తీరిక లేకుండా ఉంటారు. పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ సిద్ధం చేస్తూ బిజీగా గడుపుతుంటారు. మెడిసిన్‌లో నోబెల్ బహుమతికి ఎంపికైన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్ల్ డీసెరోథ్ కూడా సోమవారం ఉదయం అలాగే బిజీగా ఉన్నారు. ఉన్నట్టుండి ఓ వార్త ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. మెడిసిన్‌‌లో తాను నోబెల్‌కు ఎంపికైనట్లు కార్ల్‌కు ఆ ఉదయం సమాచారం అందింది.


ఈ విషయాన్ని కార్ల్ ముందుగా తన పిల్లలకు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఆయన ఇద్దరు కూతుళ్లు ఎగిరి గంతేశారు. తండ్రిని కౌగిలించుకుని అభినందనలు తెలిపారు. అలాగే, కార్ల్ 16 ఏండ్ల కుమారుడు హడ్సన్ కూడా తన తండ్రి నోబెల్ బహుమతి గెలిచారని తెలిసి ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టాడు. ‘‘నోబెల్ బహుమతి గెలిచానని ఈ ఉదయం నాకు ఫోన్ కాల్ వచ్చింది’’ అని కార్ల్ అతనికి చెప్పారు. దీంతో హడ్సన్ తన తండ్రిని కౌగిలించుకుని అభినందనలు తెలిపాడు. ఇద్దరూ పంచెస్, హైఫైతో సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న కార్ల్ పెద్ద కుమారుడు అలెగ్జాండర్ (18) కూడా తండ్రికి కంగ్రాట్స్ చెప్పాడు. తల్లి నుంచి మెసేజ్ వచ్చిన తర్వాత అలెగ్జాండర్ వెంటనే కార్ల్‌‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు.


కాగా.. పీటర్ హెగెమాన్ (జర్మనీ), జార్జ్ నాగెల్ (జర్మనీ) తో కలిసి కార్ల్.. మెడిసిన్‌లో నోబెల్ బహుమతి గెలుచుకున్న విషయం తెలిసిందే. మెదడులోని నాడీకణాలను కాంతితో నియంత్రించే సరికొత్త సాంకేతికతను ఆ ముగ్గురు సైంటిస్టులు అభివృద్ధి చేశారు. కాంతిని ఉపయోగించి నాడీకణాల పనితీరును ఆన్‌ లేదా ఆఫ్‌ చేసేలా నియంత్రించే ‘ఆప్టోజెనెటిక్స్‌’ అనే సాంకేతికత, కాంతి ఆధారిత అయాన్‌ మార్గాలపై చేసిన పరిశోధనలకుగాను వారిని 2026 నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్టు నోబెల్‌ ప్రైజ్‌ కమిటీ సోమవారం వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సౌదీ రక్షణకు తుర్కియే, పాకిస్థాన్ బలగాలు..

వాళ్ల దగ్గర భారీగా అణ్వాయుధాలున్నాయి..

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 06 , 2026 | 12:47 PM