కెప్టెన్ మచ్చార్ పుర్రెకు ఎమర్జెన్సీ సర్జరీ
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:56 PM
ఒమనీ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ చేతిలో తీవ్రంగా గాయపడి విమానం కూలకుండా కాపాడిన ఫ్లైదుబాయ్ విమానం హీరో, భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ పుర్రెకు ఫ్రాక్చర్ ఏర్పడిందని డాక్టర్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా యూఏఈలోని అబుదాబిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఒమనీ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ చేతిలో తీవ్రంగా గాయపడి విమానం కూలకుండా కాపాడిన ఫ్లైదుబాయ్ విమానం హీరో, భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ పుర్రెకు ఫ్రాక్చర్ ఏర్పడిందని డాక్టర్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా యూఏఈలోని అబుదాబిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత నెల 30న ఫ్లైదుబాయ్ విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తుండగా కోపైలట్ హమ్మామీ.. కాక్‌పిట్‌లోని గొడ్డలి తీసుకుని మచ్చార్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే.
తీవ్రంగా గాయపడినా.. మచ్చార్ అలాగే హమ్మామ్‌ను ప్రతిఘటించి 174 మందిని కాపాడారు. విమానం సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యాక మచ్చార్‌ను వెంటనే ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన పుర్రెను రీకన్‌స్ట్రక్ట్ చేశారు. ఆయన పుర్రెలో ఫ్రాక్చర్ ఏర్పడినట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం తర్వాత ఆయనను యూఏఈలోని అబుధాబిలో మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ఆయన పుర్రెకు అయిన గాయాన్ని ‘డిప్రెస్డ్ స్కల్ ఫ్రాక్చర్’ గా వ్యవహరిస్తామని డాక్టర్లు తెలిపారు.
ఇలాంటి స్థితిలో పుర్రె విరిగి, అందులోని ఎముక ముక్క మెదడు వైపు వెళుతుందన్నారు. ఇది సీరియస్ గాయమని, ఈ స్థితిలో ఎముక ముక్క మెదడుపై ఒత్తిడి కలిగించడం లేదా గాయపరచడం వంటివి చేసే ప్రమాదం ఉందని డాక్టర్లు వివరించారు. ఈ టైంలో పేషెంట్‌కు అత్యవసర మెడికల్ కేర్ లేదా సర్జరీ అవసరమన్నారు. అయితే, మచ్చార్ వేగంగానే కోలుకుంటున్నారని, చికిత్సకు బాగా స్పందిస్తున్నారని వెల్లడించారు. కాగా.. మచ్చార్‌ను కలిసేందుకు అధికారులు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించారు. దీంతో వారు మచ్చార్‌ను కలిసి మాట్లాడారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సౌదీ రక్షణకు తుర్కియే, పాకిస్థాన్ బలగాలు..
వాళ్ల దగ్గర భారీగా అణ్వాయుధాలున్నాయి..
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..