Share News

ఆ కోపైలట్‌కు ఇరాన్‌తో సంబంధం ఉండొచ్చు: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Oct 02 , 2026 | 07:45 AM

ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడిచేసిన ఒమన్ కోపైలట్‌కు ఇరాన్‌తో సంబంధం ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, తనకున్న సమాచారం మేరకు ఆ కోపైలట్‌కు ఇరాన్‌తో సంబంధం ఉండవచ్చనే అనుకుంటున్నానని ట్రంప్ పేర్కొన్నారు.

ఆ కోపైలట్‌కు ఇరాన్‌తో సంబంధం ఉండొచ్చు: డొనాల్డ్ ట్రంప్

ఇంటర్‌నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడిచేసిన ఒమన్ కోపైలట్‌కు ఇరాన్‌తో సంబంధం ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, తనకున్న సమాచారం మేరకు ఆ కోపైలట్‌కు ఇరాన్‌తో సంబంధం ఉండవచ్చనే అనుకుంటున్నానని ట్రంప్ పేర్కొన్నారు. ఆ కోపైలట్‌కు ఇరాన్‌తో సంబంధం ఉండవచ్చా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ట్రంప్ అలా బదులిచ్చారు.


‘ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చార్‌పై కోపైలట్ చేసిన దాడిపై మా ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు ఆ కోపైలట్‌కు ఇరాన్‌తో సంబంధం ఉండవచ్చని భావిస్తున్నాం. దీనిపై మరింత దర్యాప్తు జరిగిన తర్వాత స్పష్టత వస్తుంది’ అని ట్రంప్ తెలిపారు. కాగా.. ఆ కోపైలట్ వెనుక ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రోద్బలం లేదా ఇస్లామిక్ భావజాలం ఉండవచ్చా అని ఆ రిపోర్టర్ ప్రశ్నించగా.. అయి ఉండవచ్చని ట్రంప్ చెప్పారు.


ఇప్పుడే చెప్పలేం: నెతన్యాహు

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఫ్లైదుబాయ్ ఘటనపై గురువారం స్పందించారు. ఓ మీడియా చానెల్‌తో ఆయన మాట్లాడారు. కోపైలట్‌కు ఇరాన్‌తో సంబంధం ఉండవచ్చా అని అడిగిన ప్రశ్నకు నెతన్యాహు బదులిస్తూ.. ఆ విషయంపై ఇప్పుడే ఒక అభిప్రాయానికి రాలేమన్నారు. ఆ కోపైలట్‌కు ఇరాన్‌తోగానీ, లేదా మరెవరితోగానీ సంబంధం ఉన్నట్లు ఇప్పుడే చెప్పలేమని నెతన్యాహు అన్నారు. అతనికి ఇరాన్‌తో సంబంధం ఉందా అని అప్పుడే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటుతనం అవుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు తర్వాతే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే, ఆ కోపైలట్ మాత్రం కచ్చితంగా ఇస్లామిక్ భావజాలాన్ని పెంపొందించుకున్నాడని ఆయన అన్నారు. కాగా.. మచ్చార్‌పై దాడి వెనుక ఉద్దేశం ఇప్పటివరకూ తెలియరాలేదు. కోపైలట్ వెనుక ఉగ్రవాదుల హస్తంపై దర్యాప్తు చేస్తున్నామని యూఏఈ తెలిపింది.


ఇవి కూడా చదవండి..

మచ్చార్‌ తెగువకు ప్రపంచం ఫిదా

నా వల్లే ఆ రెండు దేశాలు ఇంకా మిగిలున్నాయి: డొనాల్డ్ ట్రంప్

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 02 , 2026 | 09:09 AM